Watch Video: కాలేజీలు రీ ఓపెనింగ్ వేళ.. అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులకు షాక్..

మరోరోజు ఆగితే స్కూల్లో, కాలేజీలు తెరుచుకోబోతున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉరుకులు, పరుగులతో కొత్త విద్యా సంవత్సరం ఆరంభానికి అంతా రెడీ అవుతున్న వేళ అక్కడ ఓ కాంట్రాక్టర్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఆయన బిల్లుల వసూలు కోసం కాలేజీకి అడ్డంగా కంపతో కూడిన కంచె కొట్టాడు. నూతనంగా నిర్మించిన కాలేజీ భవనానికి ముళ్లకంచవేసి నిరసన తెలిపాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఈ ఘటన వెలుగు చూసింది.

Watch Video: కాలేజీలు రీ ఓపెనింగ్ వేళ.. అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులకు షాక్..
Govt. Collage
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 10, 2024 | 11:35 AM

మరోరోజు ఆగితే స్కూల్లో, కాలేజీలు తెరుచుకోబోతున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉరుకులు, పరుగులతో కొత్త విద్యా సంవత్సరం ఆరంభానికి అంతా రెడీ అవుతున్న వేళ అక్కడ ఓ కాంట్రాక్టర్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఆయన బిల్లుల వసూలు కోసం కాలేజీకి అడ్డంగా కంపతో కూడిన కంచె కొట్టాడు. నూతనంగా నిర్మించిన కాలేజీ భవనానికి ముళ్లకంచవేసి నిరసన తెలిపాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించారు. కొత్త భవనానికి విద్యార్థులు వెళ్లకుండా భవన నిర్మాణ గుత్తేదారు ముళ్ళ కంచను అడ్డుగా వేశారు. భవన నిర్మాణం 90 శాతం పూర్తయినా బిల్లులు రాలేదని.. దీంతో అప్పులు చేసి భవన నిర్మాణం చేపట్టమని అంటున్నాడు. బిల్లుల చెల్లింపులో జాప్యం కావడంతో తీవ్ర ఇబ్బందులబుకు గురవుతున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కాంట్రాక్టర్.

మన ఊరు.. మనబడి పథకం కింద నూతన భవన నిర్మాణనికి ఒక కోటి యాబై లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. భవన నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారు దాదాపుగా పనులు పూర్తి చేసాడు. బిల్లుల చెల్లింపులో సంవత్సరం నుండి కాలయాపన చేస్తుండటంతో సహనం కోల్పోయిన కాంట్రాక్టర్ భవనంలోకి ఎవరూ వెళ్లకుండా ముళ్లకంచే అడ్డుగా వేశాడు. ఈ ఏడాది నుండే నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఐతే భవనంలో తరగతులు జరగకుండా, విద్యార్థులు, అధ్యాపకులు లోపలికి వెళ్లకుండా కాంట్రాక్టర్ కంచె వేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్