AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో ప్రశాంతంగా గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు.. ప్రభుత్వ పథకాలపై వచ్చిన ప్రశ్నలివే..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఒక్కనిమిషం నిబంధన అన్ని పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించారు. జూన్ 9న ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు అధికారులు. దాదాపు లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి కొన్ని ప్రశ్నలు అడిగారు.

తెలంగాణలో ప్రశాంతంగా గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు.. ప్రభుత్వ పథకాలపై వచ్చిన ప్రశ్నలివే..
Group 1 Exams
Srikar T
|

Updated on: Jun 10, 2024 | 12:03 PM

Share

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఒక్కనిమిషం నిబంధన అన్ని పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించారు. జూన్ 9న ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు అధికారులు. దాదాపు లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి కొన్ని ప్రశ్నలు అడిగారు. గ్రూప్-1 పరీక్షా ప్రశ్నా పత్రంలో గృహ జ్యోతి , మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మొదటి ప్రశ్న..

మహాలక్ష్మి పథకం క్రింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకు సరఫరా చేయడం అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది అని ప్రశ్నను అడిగారు. అందులో నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. A. ఈ పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే వర్తిస్తుంది.

B. ఈ పథకం అమలుకు అవసరమైన డబ్బును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వార్షిక ప్రాతిపదికన బదిలీ చేస్తుంది.

C. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లబ్దిదారులకు చెల్లించాల్సిన సబ్సిడీలను ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిలో చెల్లిస్తారు.

D. గ్యాస్ సిలిండర్ ధర్ ఎంత అనేది గృహయజమాని లబ్దిదారు గత ఐదు సంవత్సర కాలంలో సగటుగా వాడిన దాని పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఇలా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో ఏది ఈ పథకానికి వర్తిస్తుందో గుర్తించమన్నారు.

రెండవ ప్రశ్న..

తెలంగాణ ప్రభుత్వ గృహ జ్యోతి పథకానికి సంబంధించి కింది వాటిని గుర్తించండి..? అని రెండు అప్షన్లు అందించారు. A. అన్ని రకాల గృహ యజమానులు/ లబ్దిదారులు గృహ అవసరాలకైనా లేదా చిరువ్యాపార నిమిత్తమైనా నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఎలక్ట్రిసిటీ (విద్యుత్) వినియోగానికి అర్హులు.

B. ఈ పథకం కింద పొందవలసిన సబ్సిడి వివరాలు ప్రతి నెల 20వ తేదీలోపు డిస్కంలు పంపిస్తే.. దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడి ధనాన్ని డిస్కంలకు విడుదల చేస్తుంది. అంటూ ఈ రెండు వాఖ్యాల్లో ఏవి సరైనవో తెలపాలంటూ ఆప్షన్లను ఇచ్చారు.

దీనిపై నెటిజన్లు తమకు తోచిన, తాము ఆన్సర్ షీట్లో జతపరిచిన సమాధానాలను కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..