CM KCR: ‘దేశానికే ఆదర్శంగా తెలంగాణ సచివాలయ నిర్మాణం’: సీఎం కేసీఆర్

దేశానికే ఆదర్శవంతమైన రీతిలో సుపరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో, అందుకు తగ్గట్టుగా రూపొందించే సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

CM KCR: 'దేశానికే ఆదర్శంగా తెలంగాణ సచివాలయ నిర్మాణం': సీఎం కేసీఆర్
CM KCR
Follow us

|

Updated on: Aug 07, 2021 | 11:25 PM

Telangana: తెలంగాణ స్వయం పాలనలో ప్రజా పరిపాలన అత్యంత పారదర్శకంగా సాగుతుందని, అత్యాధునికత సాంకేతికత విధానాలను అందిపుచ్చుకుని సౌకర్యవంతమైన రీతిలో ప్రజల వద్దకే పాలనా ఫలాలు చేరుతున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన రీతిలో సుపరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో, అందుకు తగ్గట్టుగా రూపొందించే సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సీఎం ఆదేశించారు.

శనివారం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. నలుమూలలా కాలి నడకన తిరిగి పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ… ఏడేండ్ల తెలంగాణ స్వరాష్ట్రంలో సాగుతున్న ఆదర్శవంతమైన పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండే సెక్రటేరియట్ నిర్మాణ కౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా, గౌరవం ఉట్టిపడేలా ఉండాలని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో, సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకునే విధంగా సచివాలయ నిర్మాణం ఉండబోతోందని తెలిపారు. ప్రజలవద్దకే నేరుగా పాలనాఫలాలు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగానే నూతన సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ వేగవంతంగా పూర్తిచేయాలని సీఎం తెలిపారు.

సెక్రటేరియట్ ముందు, చుట్టుపక్కలనుంచి వర్షపు నీరు పోవడానికి అనువైన విధంగా వరద నీటి డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలన్నారు. విశాలమైన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఎక్కడికక్కడ నీరు తరలిపోయేలా ఉండాలన్నారు. కాంక్రీట్ నిర్మాణపనులు పూర్తయ్యేలోపే ముందస్తు వ్యూహంతో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దర్వాజలు, కిటికీలు, తదితర ఫర్నిచర్, విద్యుత్, ప్లంబింగ్ టైల్స్ వంటి సచివాలయ నిర్మాణంలో వినియోగించే అన్ని రకాల విభాగాలకు చెందిన ఇంటీరియర్ మెటీరియల్‌ను ముందస్తుగా సమకూర్చుకోవాలన్నారు. తద్వారా పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించడానికి వీలవుతుందన్నారు.

సచివాలయం ముఖద్వారాన్ని, బయటి గేటు నిర్మాణాలను, వాటికి అమర్చవలసిన గ్రిల్స్ తదితర అంశాలను, సీఎం కెసీఆర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రహరీ గోడలకు అమర్చాల్సిన లాంప్ పోస్టుల గురించి సూచనలిచ్చారు. విశాలంగా నిర్మిస్తున్న కారిడార్ ప్రాంతాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం, సీఎస్ సహా మంత్రుల కార్యాలయాలు, ఇతర సిబ్బంది, సాధారణ పరిపాలన అధికారుల కార్యాలయాల నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు.

సచివాలయం చుట్టూ కాలినడకన తిరిగి నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. ఇతర రాష్ర్ట్రాలనుంచే కాక, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ప్రముఖుల కోసం నిర్మితమౌతున్న‘వెయిటింగ్ హాల్’ ల నిర్మాణాల తీరును, సందర్శకులు కూర్చునే ప్రదేశాలను సీఎం పరిశీలించారు. పార్కింగ్ వ్యవస్థ గురించి ఆరాతీశారు. కార్లు, టూ వీలర్స్, బస్సులు తదితర వాహనాల పార్కింగు స్థలాలను పరిశీలించారు. హెలీపాడ్ నిర్మాణం గురించి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులు తదితర సందర్శకులు, సెక్రటేరియట్‌కు వచ్చే వీఐపీల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను సీఎం వివరించారు. అవసరమైన వారికోసం బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ నిర్మాణంలో కీలకమైన గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో, ప్రత్యేక చర్యలు చేపట్టి పై అంతస్తుల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అందుకోసం ఎటువంటి చర్యలు చేపట్టాలో చర్చించి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Also Read: Devil Fish: జగిత్యాల జిల్లాలో చిక్కిన అరుదైన దెయ్యం చేప.. ఇది వేరే చేపల్ని బ్రతకనియ్యదు..

CM KCR: తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..