Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకువస్తాం: రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. తమకే పీసీపీ పగ్గాలు కావాలంటూ చాలామంది రకాల ప్రయత్నాలు జరిగినా..
Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. తమకే పీసీపీ పగ్గాలు కావాలంటూ చాలామంది రకాల ప్రయత్నాలు జరిగినా.. రేవంత్ ఢిల్లీ కేంద్రంగా తన మార్క్ ప్రయత్నాలు చేశారు. ఎన్నో రోజులుగా ఈ అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రయత్నాలు ఎట్టకేలకు అధిష్టానం ఖరారు చేసింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం, అమర వీరుల ఆశయాల కోసం పని చేస్తానని, రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ ఆలోచన మేరకు పని చేస్తానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అంటే కార్యకర్తల పార్టీ అని నిరూపిస్తామని, నిన్న, మొన్నటి వరకు అభిప్రాయ బేధాలు ఉన్నవారిని కూడా మాట్లాడుతానని అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని పని చేస్తామని, సీనియర్లందరినీ కలుస్తానని రేవంత్ పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగుల కోసం పని చేస్తానని, కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఎప్పుడు ఉండే ఉంటాయి.. భిన్నాభిప్రాయాలు బేధాభిప్రాయాలు కావు.. అందరిని కలుపుకొని వెళ్తూ పార్టీని ముందుకు నడిపిస్తానని పేర్కొన్నారు. మంచి వ్యూహంతోముందుకు వెళ్తామని, నిన్న, మొన్నటి వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని కూడా కలుపుకొని పోతానని, ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు, కోమటిరెడ్డి బ్రదర్స్ మా కుటుంబం, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, జానారెడ్డి లాంటి వాళ్లు తో మాట్లాడి మంచి కార్యచరణతో పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని వ్యాఖ్యానించారు.
టీపీసీసీపై జగ్గారెడ్డి కామెంట్స్
అలాగే రేవంత్ రెడ్డి నియామకంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్‌గా నచ్చిన వాళ్లు వస్తే ఒక రకంగా.. నచ్చనివాళ్లు వస్తే ఒక రకంగా పని చేయడం అనేది సహజమని, కోఆర్డినేషన్ బాధ్యతలు అధ్యక్షుడిదేనని, పార్టీలో అలకలు, అసహనాలు అనేవి సహజమని అన్నారు. వీటన్నింటిని అధ్యక్షుడే హ్యాండిల్ చేయాలన్నారు.