AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రేపే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలు ఇవే

ఏపీ తరహా వాలంటరీ వ్యవస్థ , విద్య, వైద్యంకు పెద్దపీట లాంటి అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చిందట కాంగ్రెస్. జర్నలిస్టులతో పాటు ఉమెన్ స్టూడెంట్స్‌కు మెట్రో ప్రయాణం ఉచితంగా ఇవ్వనుందట కాంగ్రెస్. ఇవి మాత్రమే కాకుండా యువ న్యాయవాదులకు మొదటి మూడేళ్ళు ప్రభుత్వం నుంచి కొంత సహాయాన్ని అందించే స్కీంను మ్యానిఫెస్టో లో చేర్చారట.

Telangana: రేపే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలు ఇవే
Telangana Congress
TV9 Telugu
| Edited By: |

Updated on: Nov 16, 2023 | 8:37 PM

Share

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది.  ఇప్పటికే 6 డిక్లరేషన్స్ ప్రకటించిన కాంగ్రెస్ పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం అయింది. జనాకర్షక హామీలతో మ్యానిఫెస్టో సిద్ధం చేసింది హస్తం పార్టీ. కాంగ్రెస్ పేటెంట్‌గా చెప్పుకునే పథకాలతో పాటు కొత్త పథకాలు మ్యానిఫెస్టోలో ఉంటాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. రైతు, యువ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్స్ ప్రకటించడమే కాకుండా 6 గ్యారెంటీ హామీలతో ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే డిక్లరేషన్స్ ప్రకటించడం మొదలు పెట్టిన టీ కాంగ్రెస్.. చివరగా మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, ప్రజా సంఘాల అభిప్రాయం తీసుకున్న అనంతరం మ్యానిఫెస్టో రూపోందించారు మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు.

మ్యానిఫెస్టోలో పలు కీలక హామీలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం, రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమీషన్, అభయ హస్తం పథకం తిరిగి పునరుద్ధరణ, ఆర్ఎంపీ ,పీఏంపీలకు గుర్తింపు కార్డు, అమ్మహస్తం పేరుతో 9 నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు ఎంబీసీలకు ప్రత్యేక కార్పోరేషన్, ధరణి స్థానంలో భూ భారతి పేరుతో అప్ గ్రేడ్ యాప్, పేదింటి మహిళలకు పెళ్లి సమయంలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం లాంటి హామీలు మ్యానిఫెస్టోలో ఉండనున్నాయని సమాచారం.

వీటితో పాటు ఏపీ తరహా వాలంటరీ వ్యవస్థ , విద్య, వైద్యంకు పెద్దపీట లాంటి అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చిందట కాంగ్రెస్. జర్నలిస్టులతో పాటు ఉమెన్ స్టూడెంట్స్‌కు మెట్రో ప్రయాణం ఉచితంగా ఇవ్వనుందట కాంగ్రెస్. ఇవి మాత్రమే కాకుండా యువ న్యాయవాదులకు మొదటి మూడేళ్ళు ప్రభుత్వం నుంచి కొంత సహాయాన్ని అందించే స్కీంను మ్యానిఫెస్టో లో చేర్చారట. ఇలా పలు జనాకర్షక పథకాలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందించారని వినికిడి. శుక్రవారం తెలంగాణ పర్యటన కు వస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే చేతుల మీదగా మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇప్పటికే డిక్లరేషన్స్ ,గ్యారెంటీ కార్డుతో మంచి జోష్ మీద ఉన్న హస్తం పార్టీకి మ్యానిఫెస్టో ఇంకెంత ఊపు తెస్తుందో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..