Telangana Congress: పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. ఆ సామజిక వర్గానికే పీసీసీ పగ్గాలు..?

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల పై ఫోకస్ పెట్టింది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం బిజిబిజీగా ఉన్నారు. ఇటు టీపీసీసీ చీఫ్ గా.. అటు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. సీఎంగా అన్ని వ్యవహారాలను చూస్తూనే.. పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు.

Telangana Congress: పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. ఆ సామజిక వర్గానికే పీసీసీ పగ్గాలు..?
Telangana Congress
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 12, 2023 | 5:59 PM

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల పై ఫోకస్ పెట్టింది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం బిజిబిజీగా ఉన్నారు. ఇటు టీపీసీసీ చీఫ్ గా.. అటు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. సీఎంగా అన్ని వ్యవహారాలను చూస్తూనే.. పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు. ఈ తరుణంలో పూర్తిస్థాయిలో పీసీసీ నియామకంపై గాంధీభవన్ లో జోరుగా చర్చ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు 3 నేలలు మాత్రమే ఉండడంతో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. 17 స్థానాల్లో దాదాపు 15 – 16 స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు.. అందులో భాగంగా పూర్తి స్థాయి పీసీసీ నియామకంపై హైకమాండ్ దృష్టి పెట్టింది.

అయితే, ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం, డిప్యూటీ సీఎంగా ఎస్సి సామజిక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పీసీసీ పదవి బీసీలకు ఇవ్వనున్నారనే చర్చ జరుగుతుంది. అయితే పీసీసీ ఆశిస్తున్న వారిలో సీనియర్ నేతలైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మధుయాష్కి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ బీసీలకు ఇస్తే.. బీసీలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో సమ ప్రాధాన్యత కల్పిస్తుందని ఎన్నికల్లో కూడా అన్ని వర్గాల వారు అండగా నిలబడే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.

మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం లేకపోవడంతో ఒకవేళ పీసీసీ మైనారిటీలకు అవకాశం కల్పిస్తే.. సీనియర్ నేత షబ్బీర్ అలీ కి ఇచ్చే అవకాశం ఉంది. షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. ముందు నుంచి రేవంత్‌కి అండగా ఉన్నారు. షబ్బీర్ అలీని మంత్రి వర్గంలోకి తిసుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఒకవేళ ఆయనకు మంత్రి పదవి దక్కకపోతే పీసీసీ రెసులో ఉండే అవకాశం ఉంది. వీరితో పాటు గతంలో పీసీసీ ఆశించి ఎన్నికల్లో ఓటమి చెందిన జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి లు సైతం పీసీసీ ఆశిస్తున్నట్లు సమాచారం.. ఒకవేళ సామాజిక సమీకరణలను అధిష్టానం దృష్టిలో పెట్టుకుంటే బీసీలకే పీసీసీ వచ్చే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. త్వరలోనే పీసీసీ చీఫ్ ను మారుస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ పదవిని ఎవరికి ఇస్తుంది.. రేసులో ఎవరెవరు ఉంటారు.. తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..