Army Helicopter Crash Lance Naik Sai Teja: ఫ తమిళనాడులో జరిగిన ఆర్మీ ఎలిక్టార్ ప్రమాదంలో మరణించిన వారిలో తెలుగువాడు కూడా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ మృతుల్లో ఒకరు. అయితే అమరాజవానుకు దేశం మొత్తం నివాళుర్పించింది. అయితే రాజకీయ నేతలు, మంత్రుల స్పందన అంతంత మాత్రంగానే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. అంతేకాదు అమరాజవాను సాయి తేజకు నివాళుర్పించిన విషయంపై ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమర జవాన్ సాయి తేజ కు నివాళ్లు అర్పించడానికి ఏపీ మంత్రులు హాజరుకాకపోవడం పట్ల బాధపడుతున్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యప్ప మాలలో ఉంటే.. ఇతర మంత్రులు వెళ్లవచ్చు కదా అని అన్నారు. అసలు ఏపీ సీఎం జగన్ ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక సీఎం కేసీఆర్ .. పీవీ సింధు, సానియా మీర్జా కు కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేస్తూ.. మరి అమర జవాన్ కు ఇయ్యరా అంటూ ప్రశ్నించారు. అసలు సాయి తేజ సాటి తెలుగు వాడని కూడా కేసీఆర్ గౌరవించరా అంటున్నారు వీహెచ్. 700 మంది రైతులకు పరిహారం ఇస్తానన్న కేసీఆర్.. దేశభక్తులకు ఇయ్యరా అన్నారు. సీఎం జగన్ వస్తే కౌగలించుకునే కేసీఆర్.. సైనికుని విషయంలో ఇదేనా అనుసరించే విధానం అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాయి తేజ కుటుంబం నుంచి దేశం కోసం ఇద్దరు కొడుకు లను పంపించారు… మరి ఇలాంటి విషయంలోజవాన్ల ను ప్రభుత్వం గౌరవిస్తేనే దేశ యువతకు మంచి సందేశం అందుతుందని.. కనుక మనం మన ప్రభుత్వాలు అమర సైనికులను గౌరవించాలంటూ హితవు చెప్పారు వీ. హనుమంతరావు.
Also Read: మిస్ యూనివర్స్ హర్నాజ్‌కు ఆనంద్ మహేంద్ర ప్రశంసలు.. కొత్తవార ఆరంభాన శుభవార్త అంటూ..