Gaddam Vinod: మంత్రి పదవి కోసం ‘గడ్డం బ్రదర్స్’ మధ్య తీవ్ర పోటీ.. సోనియాను కలిసిన వినోద్..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 119 స్థానాల్లో 64 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ తరుణంలో సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎల్పీ మీటింగ్ జరిగినప్పటికీ.. సీఎం రేసులో కీలక నేతలు ఉండటంతో.. ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే డీకే శివకుమార్ నేతృత్వంలోని పరిశీలకుల బృందంతో చర్చలు జరిపిన అధిష్టానం.. పలు సూచనలు చేసింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 119 స్థానాల్లో 64 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ తరుణంలో సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎల్పీ మీటింగ్ జరిగినప్పటికీ.. సీఎం రేసులో కీలక నేతలు ఉండటంతో.. ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే డీకే శివకుమార్ నేతృత్వంలోని పరిశీలకుల బృందంతో చర్చలు జరిపిన అధిష్టానం.. పలు సూచనలు చేసింది. ప్రస్తుతం డీకే శివకుమార్ హైదరాబాద్ కు చేరుకుని మరోసారి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపనున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేసిన సూచనలను వివరించి.. సీఎల్పీ లీడర్ ఎవరన్నదానిపై డీకే శివకుమార్ క్లారిటీ ఇవ్వనున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం ఎవరనేది ఈరోజు రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే, సీఎం ఎంపికపై కసరత్తు కొలిక్కి రాకముందే మంత్రి పదవులు ఆశిస్తున్న వారు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా మాజీ మంత్రి గడ్డం వినోద్ పావులు కదుపుతున్నారు. కొత్త కేబినెట్‌లో తనకు చోటు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. తాను గతంలో మంత్రిగా ఉన్నానని, ఈ దఫా కూడా తనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు వినోద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని వినోద్ కలిశారు. సోనియా సానుకూలంగా స్పందించారని.. తనకు కేబినెట్‌లో చోటు లభిస్తుందని వినోద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వినోద్, బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై గెలుపొందారు. చెన్నూరు నుంచి పోటీచేసిన గడ్డం వివేక్ .. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై గెలిచిన విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే.. మంత్రి పదవి హామీతోనే వివేక్ పార్టీలో చేరారని.. ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంత్రి పదవి విషయంలో గడ్డం బ్రదర్స్ వ్యూహాలపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..