Telangana: రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్.. సాంప్రదాయ పంచె కట్టులో ఆకట్టుకున్న కలెక్టర్ అనుదీప్

పాల్వంచ మండలంలోని జగన్నాథపురం రైతు దినోత్సవ వేడుకలలో కలెక్టర్ అనుదీప్ సంప్రదాయ దుస్తులను ధరించి పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఎప్పుడూ ఫ్యాంట్, షర్ట్ ధరించి ఇన్ షర్ట్ తో కనబడే.. కలెక్టర్ సంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Telangana: రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్.. సాంప్రదాయ పంచె కట్టులో ఆకట్టుకున్న కలెక్టర్ అనుదీప్
Collector Poster

Updated on: Jun 03, 2023 | 1:49 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆహార్యం మారింది. ప్యాంటు, షర్ట్ టో ఇన్ షర్ట్ చేసి కనిపించే కలెక్టర్ శనివారం విభిన్నంగా సాంప్రదాయ దుస్తులతో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. అచ్చు  అన్నదాతలా ఆయన పంచె కట్టులో కనిపించారు. తెల్లటి చొక్కా, జరీ అంచు పంచెలో ఆయన మెరిసిపోయారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవం నిర్వహించారు. జిల్లాలోని 67 వ్యవసాయ క్లస్టర్ల రైతు వేదికలు సంబురాలుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాల్వంచ మండలంలోని జగన్నాథపురం రైతు దినోత్సవ వేడుకలలో కలెక్టర్ అనుదీప్ సంప్రదాయ దుస్తులను ధరించి పాల్గొన్నారు.

విధి నిర్వహణలో ఎప్పుడూ ఫ్యాంట్, షర్ట్ ధరించి ఇన్ షర్ట్ తో కనబడే.. కలెక్టర్ సంప్రదాయ దుస్తులతో, మెడలో పచ్చని కండువా ధరించి అచ్చంగా అన్నదాతలా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. రైతు దినోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో రైతులుహాజరయ్యారు. రైతు వేష ధారణ లో ఉన్న కలెక్టర్ ను రైతులు పలకరించారు..

ఇవి కూడా చదవండి

Khammam: Narayana Rao

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..