Telangana Heat Waves: హైదరాబాద్‌లో భిన్న వాతావరణం.. ఓ వైపు గరిష్ట ఉష్ణోగ్రత.. మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు..

ఎండ వేడికి జడిసి ప్రజలు  ఇంట్లోనే ఉండడానికి ఆసక్తిని చూపించారు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల సమయంలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గరిష్ట స్థాయికి చేరుకుందని తెలుస్తోంది. 

Telangana Heat Waves: హైదరాబాద్‌లో భిన్న వాతావరణం.. ఓ వైపు గరిష్ట ఉష్ణోగ్రత.. మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు..
Summer Hot Waves
Follow us
Surya Kala

|

Updated on: Jun 03, 2023 | 9:25 AM

వేసవి కాలంలో భిన్న వాతావరణం చోటు చేసుకుంది. ఓ వైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి.. మరోవైపు ఎండలు మండిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతుంది. గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా ఉంది.

శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ సెలవుదినం కారణంగా పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సహా శుక్రవారం మూసివేశారు. ఎండ వేడికి జడిసి ప్రజలు  ఇంట్లోనే ఉండడానికి ఆసక్తిని చూపించారు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల సమయంలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గరిష్ట స్థాయికి చేరుకుందని తెలుస్తోంది.

నగరంలో ఖైరతాబాద్, సెరిలింగంపల్లి, గచ్చిబౌలి పరిధిలోని ప్రాంతాల్లో గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాత చార్మినార్‌, రామచంద్రపురం (బీహెచ్‌ఈఎల్‌ ఏరియా)లలో గరిష్ట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 41.6 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదైంది.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధిక స్తాయిలో నమోదవుతున్నాయి. నల్గొండలో గరిష్టంగా 46.8 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 46.6 డిగ్రీల సెల్సియస్, పెద్దపల్లిలో 46.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా నమోదయ్యాయి.

రాబోయే కొద్ది రోజుల పాటు తెలంగాణలో విపరీతమైన వేడి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యి జూన్ 14 వరకు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ ఊర్లో బడికి వెళ్లాలంటేనే దడుసుకుంటున్న పిల్లలు.. ఎందుకో తెలుసా?
ఆ ఊర్లో బడికి వెళ్లాలంటేనే దడుసుకుంటున్న పిల్లలు.. ఎందుకో తెలుసా?
నా సినిమాతోపాటు ఆ సినిమాలు కూడా బాగా ఆడాలి..
నా సినిమాతోపాటు ఆ సినిమాలు కూడా బాగా ఆడాలి..
షూటింగ్‌ సెట్‌లో అందరికీ బిర్యానీ వడ్డించిన హీరో.. వీడియో వైరల్
షూటింగ్‌ సెట్‌లో అందరికీ బిర్యానీ వడ్డించిన హీరో.. వీడియో వైరల్
మహారాష్ట్ర ఎన్నికలు: గుండెపోటుతో ఇండిపెండెంట్‌ అభ్యర్ధి మృతి
మహారాష్ట్ర ఎన్నికలు: గుండెపోటుతో ఇండిపెండెంట్‌ అభ్యర్ధి మృతి
లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ వాయిదా
లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ వాయిదా
ఈ సీజన్‌లో ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి కొన్ని స్వదేశీ టిప్స
ఈ సీజన్‌లో ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి కొన్ని స్వదేశీ టిప్స
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఎన్డీఏ కూటమిదే పైచేయి!
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఎన్డీఏ కూటమిదే పైచేయి!
10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'బఘీర'
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'బఘీర'
ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి.. మంచి ఆరోగ్యం మీ సొంతం
ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి.. మంచి ఆరోగ్యం మీ సొంతం
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
వీటిని తింటే మీ స్టామినా డబుల్.! రోజు ఉదయం తింటే రాత్రికి..
వీటిని తింటే మీ స్టామినా డబుల్.! రోజు ఉదయం తింటే రాత్రికి..