Telangana: మరోసారి ఢిల్లీ పయనమవుతోన్న సీఎం రేవంత్‌.. కారణం ఏంటంటే..

| Edited By: Narender Vaitla

Dec 11, 2023 | 4:28 PM

ఈ నేపథ్యంలో మిగిలిన స్థానాల భర్తీకి సంబంధించి అధిష్టానంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పయనమవుతన్నారు. బుధవారం సీఎం ఢిల్లీ టూర్‌ కాన్ఫామ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మిగిలన మంత్రిత్వ స్థానాలకు సంబంధించి అదరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. మిగిలిన ఆరుగురు మంత్రులకు సంబంధించి ఎవరెవరు పోటీపడుతున్నారో ఒకసారి చూస్తే..

Telangana: మరోసారి ఢిల్లీ పయనమవుతోన్న సీఎం రేవంత్‌.. కారణం ఏంటంటే..
Revanth Reddy
Follow us on

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే వారం రోజులు కావస్తోంది. ఇక ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు సైతం తమ తమ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు మిగిలిన మంత్రి పదవులకు సంబంధించిన దానిపై తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కాకుండా ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆరు స్థానాలకు సంబంధించి ఇప్పుడు పోటాపోటీ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో మిగిలిన స్థానాల భర్తీకి సంబంధించి అధిష్టానంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పయనమవుతన్నారు. బుధవారం సీఎం ఢిల్లీ టూర్‌ కాన్ఫామ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మిగిలన మంత్రిత్వ స్థానాలకు సంబంధించి అదరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. మిగిలిన ఆరుగురు మంత్రులకు సంబంధించి ఎవరెవరు పోటీపడుతున్నారో ఒకసారి చూస్తే.. రంగారెడ్డిలో 14 నియోజకవర్గాలు నలుగురు మాత్రమే గెలిచారు. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కు స్పీకర్ మల్‌రెడ్డి, రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోటీపడుతున్నారు కానీ ఒక్క రెడ్డికి మాత్రమే ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఆదిలాబాద్‌లో పది స్థానాలు ఉంటే నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగిరింది. మంత్రి పదవికి సంబంధించి ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి గడ్డం ప్రసాద్, మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ ఉన్నారు. ఇక ఉమ్మడి నిజాంబాద్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంత్రి పదవిని ఆశిస్తారు. ఇక అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, మధుయాష్కి, మైనంపల్లిలు తమకు స్థానం లభిస్తుందనే భావనలో ఉన్నారు.

ఇక బీసీలకు ఇద్దరికి అవకాశం ఇచ్చారు కాబట్టి. ముదిరాజ్ కోటాలో అంజన్‌ కుమార్‌కి చోటు లభిస్తుందని భావిస్తున్నారు. అలాగే బీసీ కోటోలో మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి, బీర్ల ఐలయ్య, షాద్‌ నగర్‌ ఎమ్మెల్యే వేపన శంకర్‌ ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి మంత్రి పదవులకు సంబంధించి దానిపై ఒక క్లారిటీ వస్తుందని ఆశావాహులు భావస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..