CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
అగ్నిమాపక శాఖ రాష్ట్ర ప్రధానకార్యాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. గచ్చిబౌలి పరిధి నానక్ రామ్ గూడ వద్ద ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అగ్నిమాపక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అగ్నిమాపక శాఖ రాష్ట్ర ప్రధానకార్యాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. గచ్చిబౌలి పరిధి నానక్ రామ్ గూడ వద్ద ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అగ్నిమాపక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అగ్ని ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.17 కోట్ల క్రెడాయ్, 15వ ఆర్థిక సంఘం నిధులతో 29,653 చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగిందని అన్నారు. అందుకే హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా మారిందని అన్నారు. ప్రమాదం జరిగినపుడు అందరికంటే ముందుండేది ఫైర్ డిపార్ట్ మెంట్. ప్రజల రక్షణ కోసం ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతారని కితాబు ఇచ్చారు. ప్రపంచంతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోంది. నగరంలో శాంతి భద్రతలు సరైన విధంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు.
గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగిందని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే, మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామని తెలిపారు. త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళతామన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని 25వేల ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నామని సీఎం తెలిపారు. మెట్రో రద్దు కాలేదన్న సీఎం, ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేయబోతున్నామన్నారు. ఫార్మా సిటీలు కాదు. ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. అపోహలు వద్దు. మా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలతో ముందుకెళతామన్నారు. గతంలో సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తూ, భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మా విధానం అన్న ముఖ్యమంత్రి.. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…