CM Revanth Reddy: ఎవర్నీ వదిలిపెట్టం.. లగచర్ల ఘటనపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌

|

Nov 12, 2024 | 9:27 PM

Revanth Reddy: సోమవారం కలెక్టర్‌పై, ఇతర అధికారులపై దాడి చేసిన వారిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. కలెక్టర్‌పై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు..

CM Revanth Reddy: ఎవర్నీ వదిలిపెట్టం.. లగచర్ల ఘటనపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Follow us on

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొండంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజుకున్న మంట ఇంకా రగులుతూనే ఉంది.. నిన్న కలెక్టర్ సహా పలువురు అధికారులపై దాడి ఘటనలో ఓ పక్క అరెస్టులు జరుగుతున్నాయి. అటు.. రైతులు కూడా పోరుబాట ఆపేదే లేదంటూ చెప్తున్నారు. భూసేకరణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారడానికి కారణాలేంటనే దానిపై విచారణ జరుగుతోంది.

సోమవారం లగచర్లలో కలెక్టర్‌, అధికారులపై దాడి కేసులో 55 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారంపై సీరియస్‌ అయ్యారు. కలెక్టర్‌పై దాడి చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. దాడులకు ప్రోత్సహించేవారిని కూడా వదిలిపెట్టబోమన్నారు. దాడి చేసిన వారికి అండగా ఉన్న వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఎంతటి వారైనా ఉచలు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరించారు. అధికారులను చంపాలని చూస్తున్న వారిని బీఆర్‌ఎస్‌ ఎలా సమర్థిస్తుందని మండిపడ్డారు. అమృత్‌ టెండర్లపై బీఆర్‌ఎస్‌ ఆరోపణలు అవాస్తవమని, అభ్యంతరాలు ఉంటే లీగల్‌గా ఫైట్‌ చేయండని అన్నారు. సృజన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకి అల్లుడని అన్నారు. గవర్నర్‌ అనుమతి రాగానే పలువురిపై చర్యలు ఉంటాయని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి