Telangana CM KCR Press Meet High Lights: ధాన్యం కొనుగోలు, 111 జీవోపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..!
CM KCR Press Meet Updates: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. వడ్ల కొనుగోళ్లకి, జీవో 111కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ . ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. వడ్ల కొనుగోళ్ల(Paddy Procurement)కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రగతిభవన్(Pragathi Bhavan)లో సీఎం కేసీఆర్(CM KCR) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. ఢిల్లీలో చేపట్టిన దీక్షలో యాసంగి వడ్ల కొనుగోళ్లపై కేంద్రానికి కేసీఆర్ విధించిన 24 గంటల డెడ్ లైన్ ముగిసింది. అయితే వడ్లు కొనేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో.. మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి డెషిషన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే అభివృద్ధి పనులు, పథకాల అమలుపైనా భేటీలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మంత్రిమండలి సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వడ్ల సేకరణపై క్లారిటీ ఇచ్చింది. ధాన్యాన్ని కొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా కొనబోమని, పారా బాయిల్డ్ రైస్‌ను ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం లిఖితపూర్వకంగానే హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ళపై కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆహారశుద్ధి శాఖలను ఆదేశించారు. వడ్ల సేకరణపై ఒకవైపు రాజకీయ, ప్రభుత్వ ఒత్తిళ్లకు తోడు న్యాయపరంగానూ దీనిపై పోరాడాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది.
రైతులను ఆదుకునేందుకు పంజాబ్ తరహాలో కేంద్రమే వడ్లు కొనాలని, అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని హైకోర్టు, సుప్రీంకోర్టులో దీనిపై పిటిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేసింది. ఇప్పుడు రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలను తెరవాలనే నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
LIVE NEWS & UPDATES
-
7వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
కరోనా సందర్భంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో 7వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు గ్రామాల్లోనే ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసి మూడు.. నాలుగు రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
-
సాగు ఖర్చుల కోసం ఎకరానికి రూ.10 వేలుః కేసీఆర్
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సాగుకు పెట్టుబడి ఇస్తున్నాం. సాగు ఖర్చుల కోసం ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నాం. ఎలాంటి పైరవీలు లేకుండా రైతులకు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
-
-
పెండింగ్ ప్రాజెక్టులు సత్వరం పూర్తిః కేసీఆర్
ఆన్‌గోయింగ్ పెండింగ్ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడం, మిషన్ కాకతీయ పూర్తి చేయడం, రీఇంజినీరింగ్ చేసి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి వరల్డ్ లార్జెస్ట్ మల్టీ ఇరిగేషన్ స్కీం పూర్తి చేశాం. వాటి ఫలితాలు కూడా అందుతున్నాయి.
-
మిషన్ కాకతీయతో అద్భుతమైన ఫలితాలు
అనేక దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పక్కా ప్రణాలికతో కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్ తెలిపారు. అనేక ఉద్దీపనలు సమకూర్చడం జరిగింది. మిషన్ కాకతీయతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. అందులో భాగంగా కోతలు లేకుండా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని సీఎం వెల్లడించారు.
-
వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత
సమైక్య రాష్ట్రంలో అత్యంత బాధాకరంగా నలిగిపోయి, చితికిపోయిన రంగం వ్యవసాయ రంగం. తెలంగాణ ఏర్పడ్డాక సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
-
-
యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి కామన్ బోర్డు
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 3,500 పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఆధ్వర్యంలో కామన్ బోర్డు ఏర్పాటు చేసి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.
-
6 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం
6 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సంబంధిత మంత్రులే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించినట్లు సీఎం చెప్పారు.
-
జీవో 111 ఎత్తివేత
గతంలో ఇచ్చిన హామీ మేరకు జీవో 111ను ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
-
ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేస్తుందిః కేసీఆర్
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలుపై కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఈ వ్యవహారంపై ఎట్టకేలకు తేల్చేశారు. ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
-
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. రూ.1658కోట్లతో చెన్నూరు ఎత్తిపోతలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఎత్తిపోతల పథకంతో ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు తాగు, సాగునీరు అందనున్నది. చెన్నూరు ఎత్తిపోతలకు పది టీఎంసీల కాళేశ్వరం జలాలను వినియోగించాలని కేబినెట్ నిర్ణయించింది
-
పలు అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించి ఆమోదముద్ర వేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా పలు పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది.
-
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ షురూ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు.
-
కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ
సుదీర్ఘంగా కొనసాగుతోంది రాష్ట్ర కేబినెట్. పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. ఉధ్యోగాల నోటిఫికేషన్స్, 111 జీవో అమలుపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దళిత బందు పధకం అమలవుతున్న పరిస్థితులు, మన ఊరు మన బడి కార్యక్రమం, వానాకాలంలో రైతులు పండించే పంటలపై రైతాంగానికి సూచనలు చేయడం, గవర్నర్ ప్రోటోకాల్‌పై వస్తున్న ఫిర్యాదులు, తాజా రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.
-
వడ్లు కొని రైస్ మిల్లర్లకు ఇచ్చే యోచనలో సర్కార్
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి.. రైస్ మిల్లర్లకు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టంపై కేబినెట్ చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
-
111 జీవో అమలుపై చర్చ
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 111 జీవో అమలుపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
-
మే 20నుంచి.. జూన్ 5వరకు పల్లె, పట్టణ ప్రగతి
సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మే 20నుంచి.. జూన్ 5వరకు పల్లె, పట్టణ ప్రగతిని చేపట్టాలని నిర్ణయించింది సర్కార్. ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులందరూ విధిగా పాల్గొనాలని కేబినెట్ ఆదేశించింది.
-
కాసేపట్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం
కేబినెట్ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించిస్తున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం జరగనున్నట్లు సమాచారం.
-
వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చూపిస్తుందా?
కేంద్రానికి విధించిన డెడ్‌లైన్ ముగియడంతో వరం కోసం పోరు కోసం కేసీఆర్ కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటారో నని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందా ? లేక మిల్లర్లతో ప్రభుత్వమే కొనుగోలు చూపిస్తుందా ? అనే దానిపై ఇవాళ సాయంత్రం కీలక ప్రకటన రానుంది.
-
ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ తర్జనభర్జనలు
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు, వ్యవసాయ అధికారులు ఇతరులు అందరూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో పండిన ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ చర్చిస్తోంది.
-
హాట్ హాట్‌గా రాష్ట్ర కేబినెట్
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై గుర్రుగా ఉన్న సీఎం కేసీఆర్.. ఏకంగా ఢిల్లీ వేదికగా గట్టిగానే స్వరం వినిపించారు. వడ్ల కోనుగోలు కోసం కేంద్రానికి విధించిన డెడ్‌లైన్ ముగియడంతో మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Published On - Apr 12,2022 3:48 PM