CM KCR: బీజేపీ జెండా పట్టుకుని నా బస్‌కు అడ్డం వస్తారా..? వికారాబాద్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వికారాబాద్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ నూతన కలెక్టరేట్‌ భవనం, టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు..

CM KCR: బీజేపీ జెండా పట్టుకుని నా బస్‌కు అడ్డం వస్తారా..? వికారాబాద్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌
Telangana Cm Kcr
Follow us
Subhash Goud

|

Updated on: Aug 16, 2022 | 5:51 PM

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వికారాబాద్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ నూతన కలెక్టరేట్‌ భవనం, టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ను జిల్లా చేశామని అన్నారు. తెలంగాణ ఏర్పడకుంటే వికారాబాద్‌ జిల్లా అయ్యేదా..? తమ ప్రభుత్వం వచ్చాకా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని అన్నారు. వికారాబాద్‌కు మెడికల్‌, డిగ్రీ కాలేజీలు వచ్చాయని, గత పాలకులకు, ప్రస్తుతం పాలకులకు తేడాను ప్రజలు గమనించాలని ప్రజలను కోరారు. సమైక్య పాలనలో దారుణమైన పాలన చూశామని, రాష్ట్రం వస్తే భూముల ధరలు తగ్గిపోతాయని తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.

మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి పరిశుధ్దమైన మంచినీరు అందిస్తున్నామని అన్నారు. తమ రాష్ట్రం వచ్చిన తర్వాత పెన్షన్‌లను పెంచామని, కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో కరెంటు బాధలు లేవు.. అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామన్నారు. పేదింటి ఆడబిడ్డలను కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. ఉచిత కరెంటు కావాలంటే అప్రమత్తంగా ఉండాలని, ఇతర పార్టీల జెండాలు పట్టుకుని మోసపోవద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలని సరైన జెండా పట్టుకుని ముందుకెళ్లాలని, తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వికారాబాద్‌లో నేనేం తప్పు చేశాను.. బీజేపీ కార్యకర్తలు నా బస్‌కు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.

రైతు బీమా కింద రూ.5 లక్షలు అందిస్తున్నామని అన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలంటున్నారు.. బీజేపీ జెండాను నమ్ముకుంటే జనానికి శఠగోపం పెడతారని ఆరోపించారు. పెద్ద పెద్ద వ్యాపారులకు రూ.20 లక్షల కోట్లు NPAలు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తుంటే.. కేంద్రం మాత్రం ఎనిమిదేళ్ల కాలంలో చేసిందేమి లేదని మండిపడ్డారు. ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యాడని, కేంద్రంలోనూ రాష్ట్రాల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలన్నారు. కేంద్రం తీరు వల్లే నీళ్లు ఆలస్యం అవుతున్నాయని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి