సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయండి.. సీఎం కేసీఆర్ ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణమవుతున్న పాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ రివ్యూ మీటింగ్‌లో అధికారులకు పలు విషయాల్లో ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న పనులపై చర్చిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్టే పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే వర్షా కాలంలో పంటపొలాలకు నీటిని అందించాలన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తయితే ఇక్కడి భూములు సారవంతంగా పండించేందుకు అవకాశముంటుందన్నారు సీఎం. కనిష్టంగా ఒక టీఎంసీ నీటిని […]

సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయండి..  సీఎం కేసీఆర్ ఆదేశాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 24, 2019 | 6:09 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణమవుతున్న పాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ రివ్యూ మీటింగ్‌లో అధికారులకు పలు విషయాల్లో ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న పనులపై చర్చిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్టే పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే వర్షా కాలంలో పంటపొలాలకు నీటిని అందించాలన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తయితే ఇక్కడి భూములు సారవంతంగా పండించేందుకు అవకాశముంటుందన్నారు సీఎం. కనిష్టంగా ఒక టీఎంసీ నీటిని తరలించేలా పంప్‌హౌస్, టన్నెల్, కాల్వల పనులు పూర్తి చేయాలని సూచించారు. దీని ద్వారా వచ్చే ఏడాది ఖరీఫ్‌లోనే 7 లక్షల ఎకరాలకు నీరందించాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే  మొత్తం  6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది.