పార్టీ మారే ప్రశ్నే లేదు: దామోదర రాజనర్శింహ
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ. తాను బీజేపీలో చేరుతున్నట్టు కొంతమంది కావాలనే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, ఇప్పటి వరకు ఎవ్వరినీ కలవలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వీడే ప్రసక్తే లేదని చెబుతూ కొన్ని రోజులుగా ఈ ప్రచారం మరింత ఎక్కువైందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే పరిస్థితి లేదంటూ స్పష్టత ఇచ్చారు రాజనర్సింహ.