CM KCR Review: దళితబంధు అమలుపై అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం.. కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్షా..

దళిత బంధు అమలుపై సమీక్ష చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో అధికారులతో చర్చిస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అర్హుల గుర్తింపు, నిధుల కేటాయింపు, లబ్దిదారులకు...

CM KCR Review: దళితబంధు అమలుపై అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం.. కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్షా..
Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 27, 2021 | 1:20 PM

దళిత బంధు అమలుపై సమీక్ష చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో అధికారులతో చర్చిస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అర్హుల గుర్తింపు, నిధుల కేటాయింపు, లబ్దిదారులకు అందిస్తున్న స్కీమ్‌లపై సమీక్షిస్తున్నారు. పథకం అమలుపై అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. హుజూరాబాద్‌లో నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లు కలెక్టర్ ఖాతాలో జమచేసింది. ఈ నేపథ్యంలో దళితబంధుపై సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు.

అంతకు ముందు.. TRS సీనియర్ నేత, టీఆర్ఎస్ కేవీ మాజీ అధ్యక్షుడు రూప్ సింగ్ కూతురు వివాహానికి ముఖ్యమంత్రి KCR హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరులో జరిగిన ఈ వివాహ వేడుకకు మంత్రులతో కలిసి వచ్చారు.

కొద్దిసేపు, పెళ్లి మండపంలో కూర్చొన్న KCR, అనంతరం వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో CM KCRతోపాటు మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి

Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..