గత కొన్ని నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణ ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కవితకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ నోటిసులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు. ఇంకా కవితకు నోటీసులు ఇచ్చారు.. ఏం చేస్తారో చూద్దామంటూ వ్యాఖ్యానించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోంది. ఆ కారణంగానే రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో పాటు కవిత వరకు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు నోటీసులు ఇచ్చారు.. ఏం చేస్తారో చూద్దాం: సీఎం కేసీఆర్. ప్రజాస్వామ్య, న్యాయబద్దంగానే ఎదుర్కొందాం. బీజేపీని ఇంటికి పంపడంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలి. బీజేపీని ఓడించేందుకు 99 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తాం. ఆ క్రమంలో శాసనసభ్యులు తప్పులు చేయొద్దు. తప్పు చేసిన వారికి టికెట్లు దక్కవు’ అని సీఎం కేసీఆర్ ఒక పక్క బీజేపీకి ధీటుగా సమాధానం ఇస్తూనే.. బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..