Yadadri Bhuvanagiri: వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌కి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ నెల‌ 22న గ్రామానికి వస్తానంటూ..

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. ఇదే విషయంపై వాసాలమర్రి...

Yadadri Bhuvanagiri: వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌కి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ నెల‌ 22న గ్రామానికి వస్తానంటూ..
Cm KCR

Updated on: Jun 18, 2021 | 6:47 PM

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. ఇదే విషయంపై వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌కి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారు. ‘ఈ నెల 22వ తేదీన వాసాలమర్రి గ్రామానికి వస్తున్నాను. ఏర్పాట్లు చేయండి.’ అంటూ సర్పంచ్‌కి సీఎం తెలిపారు. కాగా, ఈ పర్యటన సందర్భంగా గ్రామ ప్రజలందరితో సీఎం కేసీఆర్ ఇంటరాక్ట్ అవ్వనున్నారు. అంతేకాదు.. గ్రామ ప్రజలందరికీ మధ్యాహ్నం భోజనం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయనున్నారు. భోజన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించనున్నారు.

ఇక, సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలాఉంటే.. గ‌తేడాది న‌వంబ‌ర్ నెల‌లో జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో ఆగి, గ్రామాభివృద్ధిపై స్థానికుల‌తో చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. ఆ సందర్భంగా వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22వ తేదీన వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని గ్రామ సర్పంచ్‌కి ఫోన్ చేసి తెలిపారు.

Also read:

Two Crows Harass : పోకిరి కాకులపై పోలీసులకు ఫిర్యాదు..! ఇంతకీ ఏం చేశాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..