CM KCR: ప్రజలారా మీరే సమాధానం చెప్పండి.. ధరణిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ద్వాలలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. గతంలో పాలమూరు నుంచి వలస వెళ్లేవారని.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు తరలివస్తున్నారని చెప్పారు.

CM KCR: ప్రజలారా మీరే సమాధానం చెప్పండి.. ధరణిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
CM KCR

Updated on: Jun 12, 2023 | 8:31 PM

CM KCR slams opposition: గద్వాలలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. గతంలో పాలమూరు నుంచి వలస వెళ్లేవారని.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు తరలివస్తున్నారని చెప్పారు. అయితే ఇటీవల ధరణిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం దీనిపై స్పందించారు. ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించని వాళ్లు ధరణిని తీసేస్తామని.. బంగాళఖాతంలో కలిపేస్తామని మాట్లాడుతున్నారని విమర్శించారు.

Cm Kcr

ధరణి వల్ల రైతు బంధు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతున్నాయని తెలిపారు. అనుకోకుండా ఒకవేళ రైతు మరణిస్తే రూ.5 లక్షల బీమా సొమ్మ పదిరోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయని చెప్పారు.ఏదైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ధరణి వల్ల పది నిమిషాల్లోనే పూర్తవుతుందని.. మూడేళ్ల పాటు కష్టపడి ధరణిని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ధరణి వద్దనే వాళ్లకు మీరే సమాధానం చెప్పాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Cm Kcr

24 గంటల కరెంట్, రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ భారాసనే గెలిపించాలని కోరారు. అంతకుముందు గద్వాల సమీకృత కలెక్టర్‌ భవన ప్రారంభోత్సవంలో మాట్లాడిన కేసీఆర్.. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతూ ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

Cm

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..