CM Revanth Reddy: అలా మాట్లాడితే సహించేది లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్!
CM Revanth Reddy: సీఎల్పీ సమావేశంలో ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్16 నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పర్యటించేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. గతంలో రూ.2లకే కిలో బియ్యంతో పాటు ఇప్పుడు..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్నారు. ఎవరికి వాళ్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎవరు ఏం మాట్లాడినా అంతా రికార్డవుతుందన్నారు. కొందరు ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారన్నారు. మంత్రి పదవులు అంశం అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.
సంక్షేమపథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు సూచించారు. తెలంగాణ పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని.. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారిందన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై ఏఐతో అబద్ధపు ప్రచారం చేశారన్నారు. ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్‌ఎస్ విష ప్రచారం చేస్తున్నాయని సీఎం అన్నారు.
సీఎల్పీ సమావేశంలో ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్16 నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పర్యటించేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. గతంలో రూ.2లకే కిలో బియ్యంతో పాటు ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ఇక ‘భూభారతి’ పోర్టల్‌ను రైతులకు మరింత చేరువ చేయాలని పిలపునిచ్చారు. దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి