అసలే కరోనా భయం.. ఆరోగ్యం కోసం ఇమ్యూనిటీ పెంచే పండ్లు తిందామంటే మార్కెట్‌కు వెళితే మురుగు నీటిలో నానుతున్న పండ్లు దర్శనమిస్తున్నాయి. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. సాక్షాత్తు వరంగల్ నడిబొడ్డున ఉన్న పండ్ల మార్కెట్ దుస్థితి ఇది. వరంగల్ లక్ష్మీపురంలోని పండ్ల మార్కెట్‌కు ఉమ్మడి జిల్లాకు చెందిన రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు వస్తూ ఉంటారు. ఇక్కడి మార్కెట్ నుండి వ్యాపారులు మామిడి, జామ, సపోటా, పుచ్చకాయ, కర్బూజ ఆపిల్స్, పైనాపిల్, ఇంకా అనేక రకాల పండ్లను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అంతే కాకుండా వరంగల్ ట్రై సిటీలకు చెందిన వినియోగదారులు కూడా వచ్చి పండ్లను కొనుక్కొని వెళ్తూ ఉంటారు.
ఇంత పెద్ద మార్కెట్ లో లక్షల రూపాయల పన్నులు కూడా వసూలు అవుతుంటాయి. మార్కెట్ పాలకవర్గం పరిశుభ్రత గురించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అందుకు నిదర్శనం మనం చూస్తున్న పరిస్థితి. ఇక్కడ పండ్లు తింటే ఆరోగ్యం మాట దేవుడెరుగు కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీ అధికారులకు అపరిశుభ్రత కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్‌ను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Also Read:
పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!
మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ రోగాలు రావొచ్చు!