AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో సిగరేట్ల చోరీ…ఎత్తుకెళ్లింది ఎవరో తెలుసా..?

నగరంలో వింత దొంగలు హల్‌చల్ చేశారు. దొంగలంటే..దొంగలే మరీ...వాళ్లు దోచుకెళ్లింది తెలిస్తే..మాత్రం ముక్కున వేలేసుకుంటారు..అర్ధరాత్రి హైదరాబాద్‌లో తెగబడ్డ ఆ వింతదొంగలు..ఏం చేశారంటే...

హైదరాబాద్‌లో సిగరేట్ల చోరీ...ఎత్తుకెళ్లింది ఎవరో తెలుసా..?
Jyothi Gadda
|

Updated on: Mar 02, 2020 | 11:39 AM

Share

నగరంలో వింత దొంగలు హల్‌చల్ చేశారు. దొంగలంటే..దొంగలే మరీ…వాళ్లు దోచుకెళ్లింది తెలిస్తే..మాత్రం ముక్కున వేలేసుకుంటారు..అర్ధరాత్రి హైదరాబాద్‌లో తెగబడ్డ ఆ వింతదొంగలు..ఏం చేశారంటే…

దొంగలంటే..సాధారణంగానే విలువైన వస్తువులు, డబ్బు వంటివి దోచుకెళ్తుంటారు..కానీ, హైదరాబాద్‌లో జరిగిన చోరీ మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. ఓ పాన్‌షాపులో దూరిన చోర్‌గాళ్లు…దుకాణంలోని సిగరెట్ ప్యాకెట్లన్నీ కాజేశారు. షాపులో ఉన్న సిగరెట్లన్నీ ఊడ్చేశారు. రాత్రి పాన్‌షాప్‌ మూసి వేసి ఇంటికి వెళ్లిన యజమాని.. ఉదయం వచ్చి చూడగా సిగరెట్లు మొత్తం ఎత్తుకెళ్లారు. తన షాపులో చోరి జరగడంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దొంగతనం చేసింది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రంగంలోకి దిగిన పోలీసులు ..దర్యాప్తులో భాగంగా…పాన్‌షాప్‌లోని సీసీ కెమెరాఫుటేజీని పరిశీలించారు. అయితే, చోరీకి పాల్పడింది ఓ మహిళ అని తెలియడంతో అవాక్కయ్యారు.. సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధి కర్మన్‌ఘాట్‌లో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సుమారు రూ.70 వేల విలువచేసే సిగరేట్లు దొంగతనం జరిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా రికార్డుల్లో కనిపించిన విజువల్స్ ఆధారంగా దొంగతనానికి పాల్పడిన మహిళను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు.

Follow Us
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
చికెన్ లేదా గుడ్డు.. దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉటుంది
చికెన్ లేదా గుడ్డు.. దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉటుంది
ఆ ట్యాంకర్‌లలో నీరు సురక్షితం కాదు.. జలమండలి లోగో వాడితే జైలుకే..
ఆ ట్యాంకర్‌లలో నీరు సురక్షితం కాదు.. జలమండలి లోగో వాడితే జైలుకే..
అదృష్టవంతులకే ఈ రాశుల భర్తలు దొరుకుతారు! మీకు ఆ లక్కీ ఛాన్స్..
అదృష్టవంతులకే ఈ రాశుల భర్తలు దొరుకుతారు! మీకు ఆ లక్కీ ఛాన్స్..
పుచ్చకాయ vs దోసకాయ.. ఎండాకాలంలో మీ బాడీకి ఏది మంచిది..?
పుచ్చకాయ vs దోసకాయ.. ఎండాకాలంలో మీ బాడీకి ఏది మంచిది..?
ఐపీఎల్ 19వ సీజన్ స్పెషల్.. కామెంటరీ బాక్స్‌లోకి తమిళ్ తంబీ ఎంట్రీ
ఐపీఎల్ 19వ సీజన్ స్పెషల్.. కామెంటరీ బాక్స్‌లోకి తమిళ్ తంబీ ఎంట్రీ
వంకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే .. క్షణాల్లో గిన్నెంతా ఖాళీనే
వంకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే .. క్షణాల్లో గిన్నెంతా ఖాళీనే