థాయిలాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహించి అడ్డంగాబుక్ అయిన చికోటి ప్రవీణ్ టీం.. ఇదే ఫస్ట్ టైం గ్యాంబ్లింగ్ నిర్వహణ కాదని.. రెండో సారి నిర్వహించేందుకు వెళ్లి థాయిలాండ్ పోలీసులకు బుక్కైనట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 11 నుండి 16 వరకు ఒక్కసారి గ్యాంబ్లింగ్ నిర్వహించిన సైలెంట్ గా ఇండియా తిరిగొచ్చిన చికోటి ప్రవీణ్.. మరోసారి తన గ్యాంగ్ ను వేసుకొని థాయిలాండ్ వెళ్లారు. ఈసారి భారీగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను థాయిలాండ్ తీసుకెళ్లారు. వారితో జోరుగా గ్యాంబ్లింగ్ నిర్వహించి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. అయితే అదే ఏసియా హోటల్ లో ఏప్రిల్ 11 నుంచి 16 వరకు ఒక్కసారి, ఏప్రిల్ 27 నుండి మే ఫస్ట్ వరకు రెండో సారి గ్యాంబ్లింగ్ నిర్వహించారు.
గోవాకు చెందిన డిసోజ అనే వ్యక్తి ఏప్రిల్ 12న గ్యాంబ్లింగ్ నిర్వహణపై లేఖ రాయడంతో అలర్ట్ అయిన థాయిలాండ్ పోలీసులు.. పక్కా సమాచారంతో ఏసియా హోటల్ పై దాడి చేశారు. రెడ్ హెండెడ్ గా చికోటి గ్యాంగ్ ను పట్టుకున్నారు. నిన్న మే డే కారణంగా థాయిలాండ్ పోలీసులు వివరాలు వెల్లడించలేదు. ఇవాళ చికోటి భాగోతాన్ని బయటపెట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో చాలా మంది ప్రముఖులు ఉండటం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
చికోటి ప్రవీణ్ తోపాటు అరెస్ట్ అయ్యిన వారిలో.. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్, హైదరాబాద్ కు చెందిన VRA వాసు, ఇసుక వ్యాపారి సాగర్, సుదర్శన్ రెడ్డి, భరత్ రెడ్డి, మల్లికార్జున్ రావ్, బిల్డర్ మధు, మాధవ రెడ్డి, వర్మ, తిరుమల రావ్, బొమ్మిడి వినోద్ రెడ్డి, మధు సూధన్ ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..