తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబాబాద్‌లో సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రారంభించారు. కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. అనంతరం కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేంద్రం అవలంభిస్తున్న తీరు విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. మతచిచ్చు పెట్టి ప్రజలను విడదీయాలని చేస్తున్నారన్నారు కేసీఆర్. పరిస్ధితి ఇలానే ఉంటే కేంద్రం ఆఫ్ఘన్, తాలిబన్ల రాజ్యంగా మారుతోందన్నారు. రాష్ట్రంలో కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించించేందుకు ట్రిబ్యునల్ వేసినా ఇప్పటి వరకు అతీగతి లేదన్నారు. 20 ఏళ్లుగా వాదనలే జరుగకపోతే.. తీర్పులు ఎప్పుడు రావాలి? కేటాయింపులు ఎప్పుడు జరగాలన్నారు.
50వేల టీఎంసీల నీరు సముద్రం పాలైతే దేశంలో మంచి నీళ్లకు గతి లేదన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మంచినీళ్లు ఇచ్చే శక్తి లేకుండా కేంద్రానికి లేదన్నారు కేసీఆర్. దేశానికి. దీనికి కారణం దుర్మార్గ పూరితమైన, చేతగాని దద్దమ్మల నీటి పాలసీలు కారణంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర విధానాల్లో మార్పు రావాలన్నారు , దేశం ఆలోచనా సరళి మారాలన్నారు కేసీఆర్..పార్టీలు కాదు ప్రజలు గెలిచేలా పద్దతిలో మార్పులు రావాలన్నారు. అందుకు ప్రజలు అలోచించాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్.
విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమన్నారు ముఖ్యమంత్రి.. 8 ఏళ్ల కిందటి తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు పోలికే లేదన్నారు. కేంద్ర అసమర్థ, దుర్మార్గ విధానాల వల్ల తెలంగాణ 3లక్షల కోట్లు నష్టపోయిందని ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం