Telangana: రూ.50 కే నోరూరించే వేడివేడి బిర్యానీ.. కట్ చేస్తే ఇది సీన్..
తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాలా..?. ఏ రెస్టారెంట్ అయినా బిర్యానీ ఉందంటే అక్కడ వాలిపోతారు. ఇక కాస్త పేరున్న రెస్టారెంట్లలో అయితే బిర్యానీ కోసం కస్టమర్ల క్యూ కడతారు. అదే ధమ్ బిర్యానీ.. రూ.50కి ఇస్తే...
గతంలో సిటీల్లోకి వెళ్తేనే బిర్యానీ దొరికే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లోనూ నోరూరించే బిర్యానీలు లభిస్తున్నాయి. సరనసమైన ధరలకే విభిన్న రకాల బిర్యానీలను అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం చికెన్ ధర ఎక్కువగా ఉంది.. ఈ సమయంలో.. అత్యల్ప ధరకే చికెన్ బిర్యాని ఇస్తుంటే.. ఇంకేం కావాలి చెప్పండి. జనాలు ఎగబడిపోతారు కదా.. తాజాగా ఇదే జరిగింది..కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్స్ కోసం క్యూ లైన్‌లో ఎలా ఎగబడతారో..ఇక్కడ బిర్యాని కోసం అలా ఎగబడ్డారు. అందుకే కారణం 50 రూపాయలకే బిర్యానీ అందించడం.
కేవలం 50 రూపాయలకే చికెన్ బిర్యానీ అని ఒక హోటల్ యజమాని ప్రకటించడంతో, ఆ హోటల్ ముందు బిర్యాని ప్రియులు బారులు తీరి బిర్యానీ కోసం ఎగబడటంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలోని భగత్ సింగ్ సెంటర్లో నాయుడు హోటల్‌ను నూతనంగా బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా బిర్యాని ప్రియులకు నాయుడు హోటల్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 50 రూపాయలకే చికెన్ బిర్యానీ అంటూ ఆఫర్ ఇవ్వడంతో..అలా చెప్పారో లేదో..ఇంకేముంది..పిల్లా పాపలను..ఎత్తుక్కొని మరీ తమ వంతు వచ్చేదాకా క్యూలైన్‌లో నిల్చున్నారు చాలామంది..అసలే చికెన్ ధరలు ఇక్కడ ఎక్కువగా ఉండటంతో బిర్యాని ప్రియులు ఉదయం నుండే హోటల్ వద్ద బారులు తీరారు. బిర్యానీ కూడా రుచికరంగా ఉండటంతో ఆ నోట ఈ నోట పట్టణమంతా ఈ బంపర్ ఆఫర్ ధారాళంగా వ్యాపించడంతో పట్టణ ప్రజలు క్యూలైన్లలో బారులు తీరి ఈ బంపర్ ఆఫర్‌ను వినియోగించుకున్నారు.హోటల్ యజమాని నాయుడు మాట్లాడుతూ తాను నూతనంగా ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న హోటల్‌కు గుర్తింపు రావాలని 50 రూపాయలకే చికెన్ బిర్యానీ అని ఆఫర్ పెట్టామని.. కానీ ఇంత భారీ స్పందన వస్తుందని తాను కూడా ఊహించలేదని చెబుతున్నాడు.ఆపర్ దెబ్బకు కేజీల కేజీల చికెన్ బిర్యాని వండి పెట్టాల్సి వచ్చిందట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..