Telangana: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జాభవానీపై కేసు నమోదు.. కారణమేంటంటే..

| Edited By: Ravi Kiran

Jun 27, 2023 | 7:34 PM

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జాభవానిపై కేసు నమోదు చేశారు చేర్యాల పోలీసులు. తన స్థలం ఫెన్సింగ్ కూల్చి వేసిందంటూ రాజు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. తుల్జాభవాని కూల్చివేసిన ఫెన్సింగ్ స్థలం తనదని,

Telangana: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జాభవానీపై కేసు నమోదు.. కారణమేంటంటే..
Tulja Bhavani
Follow us on

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జాభవానిపై కేసు నమోదు చేశారు చేర్యాల పోలీసులు. తన స్థలం ఫెన్సింగ్ కూల్చి వేసిందంటూ రాజు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. తుల్జాభవాని కూల్చివేసిన ఫెన్సింగ్ స్థలం తనదని, తుల్జాభవాని, ఆమె అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాజు. దాంతో పోలీసులు తుల్జాభవానితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.

ఓ భూ వివాదంలో తన తండ్రే కబ్జాకోరు అంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆయన కూతురు తుల్జాభవాని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చేర్యాలలో తన తండ్రి తన భూమిని కబ్జా చేశారని ఆరోపించింది. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే.. తనపైరుపై ఉన్న భూమిని మున్సిపాలిటికే ఇచ్చేస్తున్నానని ప్రకటించారు. ఈ క్రమంలో 1,270 గజాల స్థలం చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ని కూల్చివేసింది భవానీ. అయితే, ఆ ఫెన్సింగ్‌తో పాటు తన స్థలంలో వేసుకున్న ఫెన్సింగ్‌‌ను కూడా కూల్చివేసిందని పొరుగు ల్యాండ్ ఓనర్ రాజు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు.

అయితే, తండ్రి ముత్తిరెడ్డే తనపై కేసులు పెట్టించారని భవానీ ఆరోపిస్తుండగా.. తన కూతురును ఇతర రాజకీయ పార్టీలు ట్రాప్ చేశాయని ముత్తిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల కుట్రలో భాగంగానే కూతురు వ్యతిరేకంగా మారిందని చెబుతున్నారు ఎమ్మెల్యే. ఇలా పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో నడుస్తున్న తండ్రీకూతుళ్ల వ్యవహారం ఇప్పుడు కేసుల వరకు వెళ్లడం మరింత హీట్ పెంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..