రెండువైపులా వేర్వేరు డిజైన్లు, రంగులతో ఇక్కత్‌ పట్టుచీర.. చేనేత కళాకారుడి అద్భుత సృష్టి..

టై అండ్‌ డై డిజైనింగ్, మగ్గంతో పాటు వీవింగ్‌లో సైతం ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని వినియోగించి 15 రోజులు మగ్గంపై నేసి రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, రంగులు కలిగిన ఉల్టా లేని పట్టు చీరను తయారు చేశారు. దీంతోపాటు కొత్త డిజైన్లతో 3 శాంపిల్‌ ఇక్కత్‌ పట్టుచీరలను రూపొందించారు. వీటికి పేటెంట్‌ కోసం భరత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కత్‌లో సాధ్యం కాని ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి.. పరిశ్రమకు కొత్త ఇమేజ్‌ తీసుకొస్తున్న భరత్‌ ప్రతిభను కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు.

రెండువైపులా వేర్వేరు డిజైన్లు, రంగులతో ఇక్కత్‌ పట్టుచీర.. చేనేత కళాకారుడి అద్భుత సృష్టి..
Ikkat Silk Saree

Edited By: Jyothi Gadda

Updated on: Jan 22, 2025 | 9:12 PM

ప్రపంచవ్యాప్తంగా మగువలు మెచ్చే పట్టు చీరలకు ప్రసిద్ధి పోచంపల్లి. చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక ఇక్కడి ఈ చీరలు. సృజనాత్మకత, నూతన డిజైన్లతో వస్త్రాల తయారీ ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపానికి నిదర్శనం. రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, వేర్వేరు రంగులు కలిగిన ఇక్కత్‌పట్టు చీరను నేసి తెలంగాణ చేనేత ఘనతను ఓ కళాకారుడు ఔరా అనిపించాడు.

ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపాలు ఖండాంతర ఖ్యాతిని సాధించాయి. ఈ ప్రాంతంలోని నేతన్నలు ఎన్నో చేనేత పురస్కారాలను అందుకున్నారు. తాజాగా ఓ యువ చేనేత కళాకారుడు రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, వేర్వేరు రంగులు కలిగిన ఇక్కత్‌పట్టు చీరను సృష్టించాడు. యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లికి చెందిన సాయిని భరత్‌ అనే యువ చేనేత కళాకారుడు అద్భుత కళ రూపాలను రూపొందిస్తున్నాడు. ఎంటెక్‌ చేసిన సాయిని భరత్‌ కు చేనేత పై ఎంతో మక్కువ. అంది వస్తున్న టెక్నాలజీ సహాయంతో చేనేత రంగంలో అద్భుతాలు సృష్టించాలని ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే కొన్నేళ్ల క్రితం భరత్ మొదటి సారిగా రెండు వేర్వేరు రంగులు, డిజైన్లు కలిగిన ఇక్కత్‌ దుపట్టాను మగ్గంపై తయారు చేశారు. ఎంతో కళాత్మకంగా దుపట్టాను రూపొందించి నందుకు గాను 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ అందుకున్నారు. అదే స్ఫూర్తితో ఇక్కత్‌ కీర్తిని ఖండాంతరం చేయాలని రెండున్నర ఏళ్లు కష్టపడి, ఎంతో సృజనాత్మకంగా ఆలోచించి ఒక చీరకు వేర్వేరు డిజైన్లు, రంగులు వచ్చేలా అభివృద్ధి చేశారు.

అనంతరం టై అండ్‌ డై డిజైనింగ్, మగ్గంతో పాటు వీవింగ్‌లో సైతం ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని వినియోగించి 15 రోజులు మగ్గంపై నేసి రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, రంగులు కలిగిన ఉల్టా లేని పట్టు చీరను తయారు చేశారు. దీంతోపాటు కొత్త డిజైన్లతో 3 శాంపిల్‌ ఇక్కత్‌ పట్టుచీరలను రూపొందించారు. వీటికి పేటెంట్‌ కోసం భరత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కత్‌లో సాధ్యం కాని ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి.. పరిశ్రమకు కొత్త ఇమేజ్‌ తీసుకొస్తున్న భరత్‌ ప్రతిభను కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు. పట్టుచీరలే కాకుండా భవిష్యత్తులో ఫర్నిషింగ్‌ వస్త్రాలనూ రూపొందించనున్నట్లు భరత్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..