Hyderabad: హైదరాబాద్ లో చే గువేరా కుమార్తె.. క్యూబాకు సంఘీభావంగా ప్రపంచయాత్ర..

|

Jan 22, 2023 | 8:39 PM

పేదల ప్రపంచం తరఫున ప్రశ్నించే గొంతుకై నిలిచాడు చెగువేరా. అణచివేతపై ధిక్కార స్వరమయ్యాడు. లాటిన్‌ అమెరికా పోరాటాల నుంచి ఆఫ్రికా ఆకలి కేకల ఆరాటాల వరకు అతడు కనిపిస్తాడు. ఈ కంప్లీట్‌ కమ్యూనిస్టు..

Hyderabad: హైదరాబాద్ లో చే గువేరా కుమార్తె.. క్యూబాకు సంఘీభావంగా ప్రపంచయాత్ర..
Che Guevara Daughter
Follow us on

పేదల ప్రపంచం తరఫున ప్రశ్నించే గొంతుకై నిలిచాడు చెగువేరా. అణచివేతపై ధిక్కార స్వరమయ్యాడు. లాటిన్‌ అమెరికా పోరాటాల నుంచి ఆఫ్రికా ఆకలి కేకల ఆరాటాల వరకు అతడు కనిపిస్తాడు. ఈ కంప్లీట్‌ కమ్యూనిస్టు పోరాటానికి కామాలే తప్ప ఫుల్‌స్టాప్‌ లేదు. క్యూబాకు విముక్తి కల్పించాక మంత్రి పదవిని గడ్డిపోచలా వదిలేసి దక్షిణ అమెరికా విముక్తి పోరాటాలలో మమేకమై నేలకొరిగాడు ఈ పోరాట యోధుడు. చెగువేరా లేకపోయినా అతడి కేరక్టర్‌ని కంటిన్యూ చేస్తున్నారు డాటర్‌, డాక్టర్‌ అలైదా గువేరా. నాన్న ఆశయాల కోసం, అమెరికా అణచివేతలో మగ్గిపోతున్న క్యూబాకు సంఘీభావం కోసం ప్రపంచయాత్ర చేపట్టారు. నాన్నకు ప్రేమతో అంటూ చెగువేరా ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నారు. తలకిందుల సమాజంపై చెగువేరా పోరాటం అనే వైద్యం చేస్తే, డాక్టర్‌గా వైద్యం చేస్తూనే, డాటర్‌గా తాను కూడా సొసైటీకి ట్రీట్‌మెంట్‌ ఇస్తూ ముందుకు సాగుతున్నారు అలైదా.

కూతురు ఎస్తేఫానియా గువేరాతో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు అలైదా. క్యూబాలో మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం ఉండదన్న ఆమె.. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానన్నారు. రవీంద్రభారతిలో కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన క్యూబా సాలిడారిటీ మీటింగ్‌లో పాల్గొన్నారు. క్యూబాలో ప్రజలు పేదోళ్లలా బతికి, ధనికుల్లా చనిపోతారు. మా దేశంలో మహిళా ఫెడరేషన్ ఉంటుంది. సమాన పనికి సమాన వేతనం ఉంటుంది. క్యూబాలో ఆడ, మగ అనే వ్యత్యాసం ఉండదు. క్యూబాకు సంఘీభావం ప్రకటించండి అని ఆమె కోరారు.

అమెరికా ఆంక్షల ఉక్కు పిడికిలిలో నలిగిపోతున్న క్యూబాకు అండగా నిలబడండి అంటూ ప్రపంచాన్ని అర్ధిస్తున్నారు అలైదా. నాన్న ఆశయాలు, క్యూబా స్వేచ్ఛ కోరుతూ ప్రపంచయాత్ర చేస్తున్న ఆమె అన్ని దేశాల్లోనూ తన గొంతుకు వినిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం