Telangana: తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన..

తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. యాసంగి సీజన్ మొదలయ్యాకే టార్గెట్ నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.

Telangana: తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన..
Telangana Paddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 01, 2021 | 1:48 PM

తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. యాసంగి సీజన్ మొదలయ్యాకే టార్గెట్ నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. గత ఏడాది ఖరీఫ్‌, రబీలో ఎంత టార్గెట్ పెట్టాము.?ఎంత సేకరించామన్న లెక్కలు వెల్లడించింది. తెలంగాణ నుంచి ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల్సిందిగా ఆగస్ట్ 17న రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొంది. పెరిగిన దిగుబడి అంచనాలు, మార్కెట్లో మిగులు, పెరిగిన సాగును దృష్టిలో పెట్టుకుని సేకరణ మరింత పెంచాలని చూస్తున్నట్లు వెల్లడించింది.

ఎంత పెంచాలన్నది దిగుబడి అంచనాలు, మార్కెట్ మిగులు, సాగు తీరు గణాంకాల ఆధారణంగా నిర్ణయిస్తామని తెలిపింది కేంద్రం. టీఆర్ఎస్ ఎంపీలు నామ నాగేశ్వర రావు, మాలోత్ కవిత, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 2021-22 ఖరీఫ్‌లో వరి ధాన్యం సేకరణ టార్గెట్ 521.89 లక్షల మెట్రిక్ టన్నులుగా కేంద్రం తెలిపింది. ఇక 2020-21 రబీలో మొత్తం 55 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ పెట్టుకోగా.. 61.87 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని వివరించింది. మిగులు బియ్యాన్ని తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలు కోరడంతో టార్గెట్ మించి తీసుకున్నామని పేర్కొంది.

Also Read: AP Weather: ఏపీని వెంటాడుతున్న వరుణుడు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

 ‘కొడాలి నాని, వల్లభనేని వంశీలను భౌతికంగా లేకుండా చెయ్యాలి’.. మధిర కౌన్సిలర్ సంచలన కామెంట్స్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!