Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు షాక్.. కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీబీఐ అధికారులు..

|

Nov 30, 2022 | 1:28 PM

గంగుల లేకపోవడంతో.. ఆయన కుటుంబసభ్యులతో అధికారులు మాట్లాడారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే సీబీఐ అధికారులు రాకముందే గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ నుంచి..

Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు షాక్.. కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీబీఐ అధికారులు..
Gangula Kamalakar
Follow us on

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు షాక్ ఇచ్చింది సీబీఐ. ఇవాళ ఆయన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అక్కడ గంగుల లేకపోవడంతో.. ఆయన కుటుంబసభ్యులతో అధికారులు మాట్లాడారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే సీబీఐ అధికారులు రాకముందే గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. శ్వేత గ్రానైట్స్‌కు సంబంధించి విదేశీమారక మనీ లాండరింగ్ (ఫెమా) ఉల్లంఘించారన్న ఆరోపణలపై కొద్దిరోజుల ముందు ఈడీ అధికారులు మంత్రి గంగుల ఇంట్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. శ్వేత గ్రానైట్ వ్యవహారంలోనే వారు మంత్రి ఇంటికి వెళ్లినట్లుగా జరిగినట్లుగా సమాచారం. అయితే మరోసారి సీబీఐ అధికారులు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులతో పలు విషయాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. గ్రానైట్ వ్యవహారంపై విచారించినట్లుగా తెలుస్తోంది. గురువారం ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఈ మేరకు ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. గతంలో విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ సీబీఐ పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడు.

తాను సీబీఐ అధికారిని అంటూ చెలామణి అయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ ఇటీవల కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్‌తో దిగిన ఫోటోలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మంత్రి గంగులను సాక్షిగా విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగులకు, శ్రీనివాస్‌కు మధ్య సంబంధాలపై అధికారులు విచారించనున్నట్టు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం