
కొత్త సచివాలయంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం.. సాయంత్రం 6:15 గంటల వరకు కొనసాగింది. దాదాపు మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలు శాఖల మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సారాలు పూర్తవుతున్న తరుణంలో దశాబ్ది వేడుకులను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జూన్ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్రాభివృద్ధిపై ప్రజలకు కళ్లకు కట్టేలా వివరించేలా చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ సమావేశం. pic.twitter.com/gW7H3Y6Rnb
— Telangana CMO (@TelanganaCMO) May 18, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..