వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసినా… మరో నాలుగు కుటుంబాల్లో ఆశా దీపాన్ని వెలిగించింది. వికారాబాద్ మండలం… ఎరవల్లి గ్రామానికి చెందిన నవాత్ రెడ్డి వృత్తిపరంగా వ్యవసాయ కూలి. ముప్పయ్యేళ్ళకే అతనికి నిండు నూరేళ్ళు నిండాయి. అతనికి భార్య లక్ష్మి ,ఇద్దరు కొడుకులు ఉన్నారు. మూడు రోజుల క్రితం గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి తలకు బలమైన గాయం కావడంతో… నవాత్ రెడ్డికి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆ ఇంటి యజమాని మరణించినా… పుట్టెడు దుఃఖంలో కూడా పలువురికి సాయపడాలని ఆలోచించింది ఆ ఇంటి ఇల్లాలు.
నవాత్ రెడ్డి అవయవాలను మరో నలుగురికి ఉపయేగపడుతాయని నిమ్స్ వైద్యులు సలహా ఇవ్వండంతో….తన భర్త మరణించినా మరో నలుగురి రూపంలో తన భర్త బతికే ఉంటాడని భావించింది నవాత్‌రెడ్డి భార్య లక్ష్మి. ఆమె కుటుంబ సభ్యులు. వికారాబాద్ జిల్లాలో ఓ వ్యవసాయ కూలి కుటుంబం గొప్పకార్యానికి ఒడిగట్టింది. బ్రెయిన్ డెడ్ అయిన భర్త అవయవాలు దానం చేసి, శెభాష్ అనిపించుకుంది.
నవాత్ రెడ్డి సొదరుని భార్య చనిపోయింది. అతడు మంచానికే పరిమితమయ్యాడు. వారికి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇంట్లో వారి నాయనమ్మ కూడా ఉంది. ఇంత మందికి నవాత్ రెడ్డి ఒక్కడే పెద్ద దిక్కు…. విధి ఆడిన వింత నాటకంలో ఇప్పుడు వీరంతా రొడ్డున పడ్డారు … ఆ కుటుంబానికి ఎవరైనా భరోసా ఇవ్వాలని స్థానికుల ఆవేదన.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..