KCR: మన నీళ్లు.. మన హక్కు.. కేసీఆర్ పోరుబాట.. నల్లగొండ సభపై సర్వత్రా ఉత్కంఠ..

|

Feb 12, 2024 | 9:44 PM

KCR Nalgonda Public Meeting: తెలంగాణ అసెంబ్లీలో జలజగడం తారాస్థాయికి చేరింది. కృష్ణాజలాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ.. ఇరువర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్‌ సర్కార్‌..

KCR: మన నీళ్లు.. మన హక్కు.. కేసీఆర్ పోరుబాట.. నల్లగొండ సభపై సర్వత్రా ఉత్కంఠ..
KCR
Follow us on

KCR Nalgonda Public Meeting: తెలంగాణ అసెంబ్లీలో జలజగడం తారాస్థాయికి చేరింది. కృష్ణాజలాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ.. ఇరువర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్‌ సర్కార్‌. నల్గొండలో BRS తలపెట్టిన బహిరంగసభకు భయపడే తీర్మానం పెట్టారన్నారు గులాబీ సభ్యులు. దీంతో మాటల వేడి మరింత పెరిగింది.. అయితే, ఇదే అంశంపై రేపు నల్లగొండలో మాట్లాడేందుకు రెడీ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఎన్నికల తరువాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో.. ఆయన ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. వాటిని ప్రజలకు వివరించేందుకు చలో నల్లగొండ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ సభ జరగనుంది.

సభ ఏర్పాట్లను మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పరిశీలించారు. కృష్ణా జలాల హక్కులపై బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్ఎంబీకి అప్పగించలేదని కాంగ్రెస్ తీర్మానం చేసిందని జగదీశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతుల కోసం పోరాడేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని తెలిపారు.

మరోవైపు బీఆర్‌ఎస్ నల్లగొండ సభపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. నల్లగొండలో బీఆర్‌ఎస్ సభ పెట్టడం వల్లే.. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు.

అయితే బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నల్లగొండకు వచ్చే అర్హత కేసీఆర్‌కు లేదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బీఆర్ఎస్ సభకు ప్రజలు రామంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు.

కృష్ణా జలాలు, కేఆర్‌ఎంబీ అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం సాగడంతో.. ఈ అంశంపై గులాబీ బాస్ కేసీఆర్ నల్లగొండ సభలో ఏం మాట్లాడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..