KTR: నేడే ‘స్వేద పత్రం’ విడుదల.. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న కేటీఆర్..
శ్వేత పత్రం వర్సెస్ స్వేద పత్రం.. అసెంబ్లీ సమావేశాల నాటినుంచి తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల తర్వాత జరిగిన తొలి సమావేశాల్లోనే అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి.. ఎన్నడూ లేదనంతగా.. ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షం రెండూ కూడా ప్రశ్నలు, జవాబులతోపాటు.. విమర్శలతో హీటుపుట్టించాయి.

శ్వేత పత్రం వర్సెస్ స్వేద పత్రం.. అసెంబ్లీ సమావేశాల నాటినుంచి తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల తర్వాత జరిగిన తొలి సమావేశాల్లోనే అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి.. ఎన్నడూ లేదనంతగా.. ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షం రెండూ కూడా ప్రశ్నలు, జవాబులతోపాటు.. విమర్శలతో హీటుపుట్టించాయి. ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పలు శాఖల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా గత తొమ్మిదెన్నర పాలన, అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. వాస్తవాలు దాచిపెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడింది. తాము పదేళ్లలో సంపాదించిన ప్రగతి ఇదేనంటూ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేసిన బీఆర్‌ఎస్.. శ్వేత పత్రానికి కౌంటర్ గా స్వేదపత్రంను ఇవాళ విడుదల చేయనుంది. ముందుగా తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు “స్వేద పత్రం” పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించగా.. అది వాయిదా పడింది. అయితే, ఇవాళ కేటీఆర్ స్వేద పత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ముఖ్యంగా బీఆర్ఎస్ పాలన, తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం గురించి కేటీఆర్ వివరించనున్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేత పత్రాలకు కూడా కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో స్వేద పత్రం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కౌంటర్ గా బీఆర్ఎస్ ఎలాంటి విషయాలను ప్రస్తావిస్తుందనేది అటు రాజకీయ నేతల్లో.. ఇటు ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది.
అంతకుముందు కేటీఆర్ స్వేద పత్రం విడుదలకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో పలు విషయాలను ప్రస్తావించారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం.. పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..