సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. దశాబ్ది ఉత్సవాలు, అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలుతీరుపై నేతలకు దిశానిర్దేశం చేస్తన్నారు గులాబీబాస్.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి జూన్ 2 నాటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యి, పదో ఏడు ప్రారంభం కానున్న నేపథ్యంలో 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు కొనసాగనున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో పార్టీ శ్రేణుల భాగస్వామ్యం ఎలా ఉండాలి? ఏయే అంశాలను పార్టీ ప్రతినిధులు ప్రజల్లో తీసుకెళ్లాలి అన్న అంశాలపై కేసీఆర్ డైరెక్షన్ ఇస్తున్నారు పార్టీ అధినేత కేసీఆర్.
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ఆగస్ట్ తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో నేతలను అప్రమత్తం చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. మూడు నెలల్లో నియోజకవర్గంలో పనులన్నీ పూర్తి చేసి..మళ్లీ గెలిచేలా సిద్ధం కావాలని ఇప్పటికే నేతలకు హింట్ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్న కేసీఆర్.. అందుకు సంబంధించిన షెడ్యూల్ ప్రిపేర్ చేశారనే టాక్ వినిపిస్తోంది. వాటన్నింటిని శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. పార్టీ ప్రజా ప్రతినిధులకు వివరిస్తారని సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..