Telangana: భారీ బహిరంగసభకు ప్లాన్ చేసిన బీఆర్ఎస్.. ఏర్పాట్లు పరిశీలిస్తున్న హరీష్ రావు..

|

Apr 15, 2024 | 8:03 AM

తెలంగాణలో మరో బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ ఈ సభకు హాజరుకానున్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను కూడా విడుదల చేస్తూ తెలంగాణ నుంచే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత బీజేపీ కూడా ప్రచార జోరును పెంచే పనిలో పడింది.

Telangana: భారీ బహిరంగసభకు ప్లాన్ చేసిన బీఆర్ఎస్.. ఏర్పాట్లు పరిశీలిస్తున్న హరీష్ రావు..
Kcr Chevella
Follow us on

తెలంగాణలో మరో బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ ఈ సభకు హాజరుకానున్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను కూడా విడుదల చేస్తూ తెలంగాణ నుంచే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత బీజేపీ కూడా ప్రచార జోరును పెంచే పనిలో పడింది. ప్రధాని మోదీతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించనుంది. ఇందుకు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యేలా ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది. లోకల్ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల వేదికగా భారీ బహిరంగ సభలు నిర్వహించింది. ఈనెల 16న మరోభారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతుంది. ఈసారి రెండంకెల స్థానాల్లో విజయం సాధించి అధికారపక్షానికి షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే ఇప్పటికే కరీంనగర్ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం తాడ్‌దాన్‌పల్లిలో ఈ నెల 16వ తేదీన బీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలిని హరీష్ రావు, జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల శంఖారావంలో భాగంగా జహీరాబాద్, మెదక్ పార్లమెంట్లకు సంయుక్తంగా 16 తేదీ కేసీఆర్ జోగిపేట సమీపంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు హరీష్‌రావు. ఈ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి తిరోగమనం దిశగా సాగుతోందన్నారు. తొందరపడి తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని.. ప్రభుత్వం మెడలు వంచైనా గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు హరీష్‌రావు. రైతులకు అండగా ఉంటామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..