KTR: ఎమ్మెల్యేల వలసలతో పార్టీకి భవిష్యత్‌ ఉందా..? ఓటమి తరువాత కేటీఆర్‌ ఎక్స్‌క్లూజివ్‌ క్రాస్‌ఫైర్‌

పదేళ్లుగా అధికారంలో ఉన్నా సంస్థాగతంగా పటిష్టమైన కేడర్‌ను నిర్మించకోలేకపోవడంతో ఇబ్బందుల్లో పడింది. మరోవైపు ఫిరాయింపుల ప్రవాహం నాయకత్వాన్ని కుదిపేస్తోంది. నమ్మకున్నవాళ్లే నట్టేట ముంచి పరాయి పంచన చేరుతుంటే బలంగా విమర్శించలేని దుస్థితి నెలకొంది. ఈ పార్లమెంట్‌ ఎన్నికలు పార్టీకి చావోరేవో అన్నట్టుగా మారాయి.

KTR: ఎమ్మెల్యేల వలసలతో పార్టీకి భవిష్యత్‌ ఉందా..? ఓటమి తరువాత కేటీఆర్‌ ఎక్స్‌క్లూజివ్‌ క్రాస్‌ఫైర్‌
Ktr In Tv9 Crossfire

Updated on: Apr 12, 2024 | 8:10 PM

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ రాష్ట్ర సమితి స్‌.. ప్రత్యేకరాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఫక్తు రాజకీయపార్టీగా అవతరించింది. బోటాబోటీ మార్కులతో 2014లో అధికారంలోకి వచ్చి, ప్రజావిశ్వాసం పొంది 2018లో 88 సీట్లతో వీరవిహారం చేసింది. అయితే బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌ 2023 ఎన్నికల్లో ప్రజల ఆదరణ పొందలేకపోయింది. గడిచిన ఐదేళ్లలో రాజకీయంగా అనుసరించిన విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. దీనికి తోడు జాతీయపార్టీల దూకుడు కారణంగా హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోవాలన్న బీఆర్ఎస్‌ కల నెరవేరలేదు.

పదేళ్లుగా అధికారంలో ఉన్నా సంస్థాగతంగా పటిష్టమైన కేడర్‌ను నిర్మించకోలేకపోవడంతో ఇబ్బందుల్లో పడింది. మరోవైపు ఫిరాయింపుల ప్రవాహం నాయకత్వాన్ని కుదిపేస్తోంది. నమ్మకున్నవాళ్లే నట్టేట ముంచి పరాయి పంచన చేరుతుంటే బలంగా విమర్శించలేని దుస్థితి నెలకొంది. ఈ పార్లమెంట్‌ ఎన్నికలు పార్టీకి చావోరేవో అన్నట్టుగా మారాయి. భవిష్యత్తు ప్రశ్నార్ధకమన్న విమర్శల మధ్య బీఆర్ఎస్‌ జెండాను నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. కేసీఆర్‌కు దళపతిగా రంగంలో దిగి పార్టీని నడిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న కల్వకుంట్ల తారకరామారావుతో టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ ఎక్స్‌క్లూజివ్‌ క్రాస్‌ఫైర్‌.

పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి…