Telangana: ఆ ఎంపీ సీటు ప్రత్యేకం.. గెలిచేందుకు బిఆర్ఎస్ సన్నాహాలు..

| Edited By: Srikar T

Apr 01, 2024 | 3:06 PM

ఎలాగైనా ఆ ఎంపీ సీట్ దక్కించుకోవాలి.. దానికోసం ఎవరి స్థాయిలో వారు సీరియస్‎గా పనిచేయాలి. ఆ సీట్ గెలుపులో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళ కార్యకర్తలకు పదే పదే చెపుతున్న మాటలు. ఇంతంకి ఇంత సీరియస్‎గా దృష్టి పెట్టిన ఆ ఎంపీ స్థానం ఎక్కడ.?

Telangana: ఆ ఎంపీ సీటు ప్రత్యేకం.. గెలిచేందుకు బిఆర్ఎస్ సన్నాహాలు..
Congress vs BRS
Follow us on

ఎలాగైనా ఆ ఎంపీ సీట్ దక్కించుకోవాలి.. దానికోసం ఎవరి స్థాయిలో వారు సీరియస్‎గా పనిచేయాలి. ఆ సీట్ గెలుపులో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళ కార్యకర్తలకు పదే పదే చెపుతున్న మాటలు. ఇంతంకి ఇంత సీరియస్‎గా దృష్టి పెట్టిన ఆ ఎంపీ స్థానం ఎక్కడ.? మెదక్ ఎంపీ సీట్‎పై సీరియస్‎గా ఫోకస్ పెట్టిందట బీఆర్ఎస్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సొంత జిల్లా కావడంతో ఈ మెదక్ పార్లమెంటు స్థానంపై సీరియస్‎గా ఫోకస్ పెట్టారు.

ఉమ్మడి మెదక్ జిల్లా అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం పోయినప్పటికి ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలను గెలుచుకుంది. అయితే ఇప్పుడు కూడా మెదక్ పార్లమెంటు స్థానంపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయలని ప్రణాళికలు రచిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు కావున ఇక్కడ గెలిచి తీరాలని పార్టీ కార్యకర్తలకు దిశ నిర్ధేశం చేస్తున్నాడట మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి నేతతో మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేయాలని చెబుతున్నారట. ఇప్పటికే 4 నియోజకవర్గల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యకర్తల్లో ఎప్పటికప్పుడు జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిమాణాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ ఎక్కడ నిరుత్సాహ పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి సీనియర్ లీడర్లు వెళ్లిపోయినా పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదు అని, మీరంతా పార్టీకి అండదండగా ఉన్నారు అని సూచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఆరు చోట్ల బీఆర్ఎస్​ అభ్యర్థులు గెలిచారని, ఈ సెగ్మెంట్ పరిధిలో పార్టీకి 2.40 లక్షల ఓట్ల మెజార్టీ లభించిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​ గెలుపు సులువేనని పార్టీ క్యాడర్‎కు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి‎గా ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్ రాంరెడ్డిని ప్రకటించడం వెనుక కూడా ఓ మతులాబు ఉంది. ఈయన గతంలో ఈ పార్లమెంట్ పరిధిలోనే కలెక్టర్‎గా పనిచేసిన వ్యక్తి కావడంతో ఇక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజలకు పరిచయం ఉండటం.. ఆయన కూడా తనను ఎంపీగా గెలిపిస్తే పేద విద్యార్థుల చదువుల కోసం తన ఎంపీ పదవి ఉన్నన్ని రోజులు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఇస్తా అని దీనికోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేస్తా అని చెపుతున్నారు. తమకు పట్టు ఉన్న ప్రదేశంలో ఓటమి పాలు అవ్వకూడదు అని మెదక్ సీట్‎ను ఎలాగైనా గెలవాలని, ఈ సీట్ గెలిస్తే వేరే లెవల్ ఉంటుంది అని, అందుకే అందరూ మెదక్ ఎంపీ స్థానంపై గులాబీ జెండా ఎగురేలా కృషి చేయాలని ఒకరికి ఒకరు చెప్పుకోని పనిచేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..