Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తవ్వకాల్లో కనిపించిన 2 కుండలు.. ఓపెన్ చేయగా కళ్లు చెదిరేలా

150 అడుగుల ఎత్తులో, కొండ మీద, కింద వంద ఎకరాల ప్రాంతంలో విస్తరించిన ఫణిగిరి మహా విహారం బౌద్ధ ఆధారాల అక్షయ పాత్రకు అభివర్ణిస్తూ ఉంటారు పురావస్తు అధికారులు. ఇక్కడ తవ్వే కొద్దీ కొత్త అద్భుతాలు బయట పడుతూనే ఉన్నాయి.  బౌద్ధ భిక్కువుల కోసం గదులు, ఎన్నో శాసనాలు, నాణేలు- ఇవన్నీ ఫణిగిరి గుట్ట మీద దొరికాయి.

Telangana: తవ్వకాల్లో కనిపించిన 2 కుండలు.. ఓపెన్ చేయగా కళ్లు చెదిరేలా
Buddhist Artefacts
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 01, 2024 | 3:07 PM

పురాతన చారిత్రక, సాంస్కృతిక ఆధారాలను తెలుసుకునేందుకు.. అప్పటి ఆచారాలను విశ్లేషించేందుకు పురావస్తు తవ్వకాలు బాగా ఉపయోగపడతాయి. ఈ క్రమంలోనే పురావస్తు శాస్త్రవేత్తలు నల్గొండ జిల్లాలో జరిపిన తవ్వకాల్లో 2వేల సంవత్సరాల క్రితం నాటి నాణేలు బయటపడ్డాయి. జిల్లాలో గల తిరుమలగిరి మండలం ఫణిగిరిలో బౌద్దుల కాలంలో వినియోగించినవిగా చెప్పబడుతున్న 3700 సీసపు నాణేలను వెలికి తీశారు. 2015లో ఫణిగిరి గ్రామంలో జరిపిన తవ్వకాల్లో కూడా  2 వేల ఏళ్ల నాటి బౌద్ద అవశేషాలను పురావస్త శాఖ సేకరించింది. ఫణిగిరి క్రీ.పూ. 3 వ శతాబ్దం , క్రీ.శ. 3వ శతాబ్ధం మధ్య కాలంలో బౌద్ద జ్ణానానికి సంబంధించిన ప్రధాన ప్రాంతంగా వర్ధిల్లినట్లు చెబుతున్నారు. అక్కడి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ద స్తూపం, విహారం, చైత్యాలు వంటివి విస్తరించి ఉన్నాయి.  కాగా తెలంగాణలోని అన్ని పురావస్తు స్థలాల కంటే ఎక్కువగా ఇక్ష్వాకుల నాటి శిల్పాలు ఇక్కడ దొరికాయట.  ఇట్లా ఇక్కడ దొరికిన ప్రతీ రాతి ముక్కా ఒక కళాఖండమే అని చెబుతుంటారు. దక్షిణ భారతంలో బోధిసత్వుడి నిలువెత్తు స్టక్కో ప్రతిమ కేవలం ఫణిగిరి తవ్వకాల్లో దొరికిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

1941లో అప్పటి  నిజాం సర్కార్ ఫణిగిరిలో తొలుత తవ్వకాలు.. జరిపి బౌద్ద ఆధారాలు కనుగొన్నది. 2001-2007లలో, తిరిగి 2018-19లో ఇక్కడ తవ్వకాలు జరిగాయి. మార్చి 31,2024న జరిపిన తవ్వకాల్లో ఈ నాణేలు, తోరణాలు, శాసనాలు, వ్యాసాలు, నాణేలు, లిఖిత  పూర్వక స్థంభాలు కనుగొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..