AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: దొందూ దొందే.. సింగరేణిపై బీఆర్ఎస్ విచిత్రమైన వాదన చేస్తోంది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

సింగరేణి బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్.. బీజేపీ.. బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం వేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం వేలంలో పాల్గొనడం పై బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ విమర్శలు సంధిస్తోంది.. దీనిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సింగరేణిపై బీఆర్ఎస్ విచిత్రమైన వాదన చేస్తోందంటూ మండిపడ్డారు.

Kishan Reddy: దొందూ దొందే.. సింగరేణిపై బీఆర్ఎస్ విచిత్రమైన వాదన చేస్తోంది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jun 22, 2024 | 6:32 PM

Share

సింగరేణి బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్.. బీజేపీ.. బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం వేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం వేలంలో పాల్గొనడం పై బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ విమర్శలు సంధిస్తోంది.. దీనిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సింగరేణిపై బీఆర్ఎస్ విచిత్రమైన వాదన చేస్తోందంటూ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిని ఇష్టానుసారంగా దోచుకున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ జోక్యంతో సింగరేణిని పూర్తిగా విధ్వంసం చేశారని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని.. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ గతంలో చెప్పారని గుర్తు చేశారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే అని మండిపడ్డారు.

సింగరేణి వ్యవస్థను బీఆర్ఎస్ హయాంలో ధ్వంసం చేశారని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి.. సింగరేణి బ్యాంక్ ఖాతాలో రూ. 3500 కోట్లు ఉండేవన్నారు. 2014కు ముందు సింగరేణిలో ఉద్యోగుల జీతాలు.. ఆలస్యంగా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. సింగరేణిని కేసీఆర్ అప్పులపాలు చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి రూ. 30 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.. బీఆర్ఎస్‌ హయాంలో విద్యుత్ సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయలేదన్నారు. ఈ కారణంగా సింగరేణికి బకాయిలు పేరుకుపోయాయన్నారు. బీఆర్ఎస్‌ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని.. బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా సింగరేణిని దోచుకున్నారంటూ ఆరోపించారు. సింగరేణిలో గతంలో విస్తృతంగా పర్యటించానని.. కేసీఆర్ కుటుంబం సింగరేణిని రాజకీయ క్షేత్రంగా ఉపయోగించుకున్నారంటూ విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!