RRB NTPCలో 3,477 గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2026 విడుదల.. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తులు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా 3,477 గ్రాడ్యుయేట్ స్థాయి NTPC పోస్టుల భర్తీకి సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 6 వరకు స్వీకరించనున్నారు. పూర్తి నోటిఫికేషన్‌లో అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, ఫీజు తదితర వివరాలను RRB వెల్లడించనుంది..

హైదరాబాద్, సెప్టెంబర్ 22: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 3,477 గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాల భర్తీకి సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 8న ప్రారంభమై నవంబర్ 6న ముగియనుంది. పూర్తి నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, ఫీజు, ఖాళీల వివరాలను RRB వెల్లడించనుంది. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి అదనపు అర్హతలు లేదా టైపింగ్ నైపుణ్యం అవసరం కావచ్చు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత స్పష్టమవుతాయి. గ్రాడ్యుయేట్ కేటగిరీలో ప్రధానంగా ఈ కింది పోస్టులు ఉంటాయి..
ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీలో భర్తీ చేసే పోస్టులు ఇవే..
- చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్
- స్టేషన్ మాస్టర్
- గూడ్స్ ట్రైన్ మేనేజర్
- జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
- సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
- ట్రాఫిక్ అసిస్టెంట్
ముఖ్యమైన వివరాలు..
- మొత్తం ఖాళీలు: 3,477
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 8
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 6
- అర్హత: డిగ్రీ
- కేటగిరీ: RRB NTPC Graduate Level
