AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambika : 46 కోట్లు కొట్టేయాలనుకున్నారు.. హీరోయిన్ రాధ ఫిర్యాదుపై అక్క అంబిక రియాక్షన్..

ప్రముఖ హీరోయిన్ రాధ కుటుంబంలో ఆస్తులు, వ్యాపారం, బంగారం వ్యవహారాలకు సంబంధించిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరిన సంగతి తెలిసిందే. తన అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్ పై నటి రాధ చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేసింది. తన గదిలో సంతకం చేసి ఉంచిన ఖాలీ చెక్కులను దొంగిలించి.. వాటి ద్వారా రూ.46 కోట్లు కాజేసేందుకు తన అక్క, సోదరుడు ప్రయత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కోన్నారు. తాజాగా ఈ వివాదం పై అంబిక స్పందించారు.

Ambika : 46 కోట్లు కొట్టేయాలనుకున్నారు.. హీరోయిన్ రాధ ఫిర్యాదుపై అక్క అంబిక రియాక్షన్..
Radha, Ambika
Rajitha Chanti
|

Updated on: Sep 22, 2026 | 1:24 PM

Share

సీనియర్ హీరోయిన్ రాధ ఇంటి వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరిన సంగతి తెలిసిందే. తన ఇంట్లో సంతకం చేసి ఉంచిన ఖాళీ చెక్కులను దొంగిలించి వాటి ద్వారా రూ.46 కోట్లు కాజేయాలని తన అక్క అంబిక, తన సోదరుడు మల్లిఖార్జున్ ప్రయత్నించారని రాధిక పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దక్షిణాది చిత్రసీమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన సీనియర్ నటీమణులు, అక్కాచెల్లెళ్లు అంబిక, రాధల మధ్య తీవ్రమైన ఆస్తి, ఆర్థిక వివాదాలు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. తన సంతకం చేసిన చెక్కులను దొంగిలించి దాదాపు రూ. 46 కోట్లు కొట్టేయడానికి ప్రయత్నించారని చెల్లెలు, నటి రాధ తన అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్‌లపై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను అంబిక తీవ్రంగా ఖండించారు.

నటి రాధ కథనం ప్రకారం.. చెన్నైలోని తన ‘ARS గార్డెన్ స్టూడియో’ బిజినెస్ అవసరాల కోసం (కంపెనీ బిల్లులు, పన్నులు, సిబ్బంది జీతాల చెల్లింపుల కోసం) సంతకం చేసిన కొన్ని ఖాళీ చెక్కులను తన గదిలో ఉంచారు. జనవరి 2025లో ఆ వ్యాపారం పేరును ‘RR గార్డెన్స్’గా మార్చి కొత్త చెక్ బుక్ పొందడంతో, పాత చెక్ బుక్ వాడటం మానేశారు. అయితే, తాను చెన్నైలో లేని సమయంలో అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్ తన గదిలోకి ప్రవేశించి ఆ పాత చెక్ బుక్‌లోని ఐదు చెక్కులను తీసుకున్నారని రాధ ఆరోపించారు. ఆ ఐదు చెక్కులను ఉపయోగించి సెప్టెంబర్ 17న బ్యాంకులో రూ. 46 కోట్లు క్లెయిమ్ చేయడానికి అంబిక ప్రయత్నించినట్లు బ్యాంకు నుండి ఈమెయిల్ మెసేజ్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు. వెంటనే బ్యాంకును సంప్రదించి చెల్లింపులను నిలిపివేసినట్లు రాధ పేర్కొన్నారు.

చెల్లెలు రాధ చేసిన మోసం ఆరోపణలపై నటి అంబిక స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి చెక్కులను దొంగిలించలేదని, తమ మధ్య ఉన్న ఆస్తి , ఆర్థిక వివాదాల పరిష్కారం కోసమే రాధ స్వయంగా ఆ చెక్కుపై సంతకం చేసి ఇచ్చిందని స్పష్టం చేశారు. మదురవాయల్‌లోని 50 సెంట్ల స్థలం, ‘ARS గార్డెన్స్ స్టూడియో’లోని వాటా, ఇన్‌కమ్ టాక్స్ దాడుల తర్వాత తిరిగి వచ్చిన 1,299 గ్రాముల బంగారం పంపకాలకు సంబంధించి చెలరేగిన వివాదాల సెటిల్మెంట్‌లో భాగంగానే ఈ చెక్కు ఇచ్చారని అంబిక తెలిపారు. దీనికి సంబంధించిన కేసులు ప్రస్తుతం తిరువళ్లూర్ కోర్టు, హైకోర్టు , కేరళలోని పోలీసు స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా, రాధ కావాలనే చెక్ బౌన్స్ అయ్యేలా చేసి తనపై అసత్య ప్రచారాలు చేస్తోందని, ఆమెపై రివర్స్ కేసు వేయనున్నట్లు అంబిక ప్రకటించారు. ఒకప్పుడు వెండితెరపై కలిసి నటించి అలరించిన ప్రముఖ అక్కాచెల్లెళ్ల మధ్య రూ. 46 కోట్ల ఆర్థిక వివాదం ముదరడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us