CM KCR: నిన్న బీసీ.. నేడు మైనారిటీ.. గులాబీ బాస్‌ వ్యూహమేంటో అర్థం కాక విపక్షాల విలవిల

ఉచిత కరెంటు తో కాంగ్రెస్ పై ఊపందుకున్న బీఆర్‌ఎస్‌ దండయాత్ర రకరకాలుగా కొనసాగుతూనే ఉంది. టార్గెట్ కాంగ్రెస్ గా గులాబీ బాస్ కేసీఆర్ తన వ్యూహాలకు రోజుకో రూపం ఇస్తున్నారు.  ఇప్పటికే ఉచిత కరెంటు విషయం లో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ధర్నాలు, రైతు సమ్మేళనాలు కాంగ్రెస్ వ్యతిరేక తీర్మానాలు చేస్తోంది బీఆర్‌ఎస్‌

CM KCR: నిన్న బీసీ.. నేడు మైనారిటీ.. గులాబీ బాస్‌ వ్యూహమేంటో అర్థం కాక విపక్షాల విలవిల
CM KCR

Edited By:

Updated on: Jul 20, 2023 | 11:20 AM

ఉచిత కరెంటు తో కాంగ్రెస్ పై ఊపందుకున్న బీఆర్‌ఎస్‌ దండయాత్ర రకరకాలుగా కొనసాగుతూనే ఉంది. టార్గెట్ కాంగ్రెస్ గా గులాబీ బాస్ కేసీఆర్ తన వ్యూహాలకు రోజుకో రూపం ఇస్తున్నారు.  ఇప్పటికే ఉచిత కరెంటు విషయం లో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ధర్నాలు, రైతు సమ్మేళనాలు కాంగ్రెస్ వ్యతిరేక తీర్మానాలు చేస్తోంది బీఆర్‌ఎస్‌. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా పార్టీలోని బీసీ నాయకులను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీల పట్ల వ్యవహరిస్తున్న తీరు వాడుతున్న భాష బాగాలేదు అవమానంగా ఉంది అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ లను ఏకం చేసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకుల తీరును ప్రజల్లోకి తీసుకెళతాం అని పిలుపునివ్వడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. ఇప్పటికే సొంత పార్టీలోనే బిసి నాయకులూ ఏకం అవ్వడం మాకు న్యాయం కావాలి అంటూ ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం లాంటి కార్యక్రమాలతో కాంగ్రెస్ అధిష్టానము తలలుపట్టుకుంటోంది. ఇప్పుడు బిఆర్ఎస్ కూడా బిసి నాయకులను రేవంత్ రెడ్డి బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటూ అటాక్ చెయ్యడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది అని చర్చ మొదలయింది.

ఇక బీసీల విషయం అలా ఉంటే మైనార్టీలను కూడా కదిలించే పనిలో పడ్డారు బీఆర్‌ఎస్‌ పెద్దలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మైనారిటీ ప్రజాప్రతినిధులతో సమావేశం పెట్టి అసలు బిసి ల పట్ల బిఆర్ ఎస్ ఎలా ఉంది ఎన్ని కార్యక్రమాలు చేసింది విపక్షలా తీరు ఎలా ఉంది మైనార్టీల పట్ల అనే విషయం పై చర్చించబోతున్నట్టు సమాచారం. ఇలా ఒక్కో సామజిక వర్గం ఒక్కో అంశం తో అన్ని వర్గాలను ఏకం చేసే పనిలో పడ్డ గులాబీ టీం విపక్షాలకు ఇబ్బందిగా మారింది అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయింది. కరెంట్ విషయం లో సక్సెస్ అయ్యామని భావిస్తున్న బిఆర్ ఎస్ ఇక అంశాల వారీగా విపక్షలను టార్గెట్ చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలను ఉపేక్షించేది లేదు అన్నది బీఆర్‌ఎస్ విధానమని తెలుస్తుంది

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..