Telangana Elections: సీటు ఉందా.. ఊడిందా..? వాట్ నెక్ట్స్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. టెన్షన్..

 BRS Candidates Final List: నా గురించి బాస్ ఏమనుకుంటున్నారు.. ఈ సారి సీట్ నాకే ఇచ్చేలా చూడండి.. ప్లీజ్.. అంటూ ప్రాథేయపడే రోజులు పోయాయ్.. ఇప్పుడు సీటు ఉందా..? ఊడిందా.. ఊడితే పరిస్థితి ఏంటీ..? వాట్ నెక్స్ట్ అంటూ గులాబీ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. సీటు ఊడకముందే పరిస్థితులను చక్కదిద్దుకుందామంటే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు..

Telangana Elections: సీటు ఉందా.. ఊడిందా..? వాట్ నెక్ట్స్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. టెన్షన్..
CM KCR

Updated on: Aug 20, 2023 | 12:21 PM

BRS Candidates Final List: నా గురించి బాస్ ఏమనుకుంటున్నారు.. ఈ సారి సీట్ నాకే ఇచ్చేలా చూడండి.. ప్లీజ్.. అంటూ ప్రాథేయపడే రోజులు పోయాయ్.. ఇప్పుడు సీటు ఉందా..? ఊడిందా.. ఊడితే పరిస్థితి ఏంటీ..? వాట్ నెక్స్ట్ అంటూ గులాబీ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. సీటు ఊడకముందే పరిస్థితులను చక్కదిద్దుకుందామంటే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.. చేతిలో ఉన్న ఆప్షన్స్ అన్నీ పోయాయ్.. ఇక గులాబీ బాసే రంగంలోకి దిగారు.. ఇక మన దగ్గర ఆప్షన్లు లేవమ్మా.. డిసైడ్ చేయడమే తరువాయి అంటూ పార్టీలోని కీలక నేతలకు ఆన్సర్ కూడా ఇచ్చేశారు. వెంటనే బీఆర్ఎస్‌ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశముందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంకేముంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ రెట్టింపు అయింది.. రేపే అభ్యర్థుల పేర్లు వస్తాయని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతుండటంతో.. ఇప్పటికే అసమ్మతి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.. అయితే, వారికి గులాబీ బాస్ టైం ఇస్తారా..? లేదా ..? అన్నది పక్కన పెడితే.. టిక్కెట్ల అంశం ఇప్పటికే పూర్తయిందని.. ఇక సీఎం కేసీఆర్ ప్రకటనే తరువాయి అంటూ వార్తలు వెలువడుతుండటంతో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు.. దేవుడిపై భారం వేసి సీఎంను కలిసేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్.. ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టేందుకు కార్యచరణను ప్రారంభించింది. ఇప్పటికే పలు దఫాలుగా నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ.. అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. రేపు బీఆర్ఎస్‌ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని తెలియడంతో అసమ్మతి ఎదుర్కొంటున్న దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ అపాయిట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. టికెట్ కోసం ఆఖరు ప్రయత్నాలు చేస్తూ ఆపసోపాలు పడుతున్నారు. 10-15 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ టెన్షన్‌ పట్టుకుంది. ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, ఇల్లందు, మునుగోడు, జహీరాబాద్‌, వేములవాడ, బోధ్‌, కొత్తగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగాం, కల్వకుర్తి, కంటోన్మెంట్‌, ఉప్పల్‌ సహా మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ రాలేదు.. దీంతో ఆ ప్రాంతాల్లో కొత్త వారికి ఛాన్స్ వస్తుందన్న ఊహగానాలతో సిట్టింగుల్లో అలజడి మొదలైంది. దీంతో ఆ ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు అంతా దేవుడిపై భారం వేసి.. అఖరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే, వారికి సీఎం కేసీఆర్ ఎలాంటి సమాధానం ఇవ్వనున్నారు.. రేపు వెలువడే అభ్యర్థుల జాబితా ఎలా ఉండనుంది..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

బీఆర్ఎస్‌ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతుండటంతో.. టికెట్ కోసం కొందరు ఎమ్మెల్యేలు ఆఖరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇల్లందు బీఆర్‌ఎస్‌లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు వ్యతిరేకంగా అసమ్మతి మొదలైంది.. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి నివాసంలో నేతలు భేటీ అయి.. ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. కొత్త వారికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటామంటామని పేర్కొన్నారు. దీంతో అసమ్మతిని ఎదుర్కొంటున్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్.. కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వస్తున్నారు. అదే క్రమంలో జనగామలో నిన్న ప్రెస్‌మీట్‌ పెట్టి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బోరుమన్నారు. ఈ క్రమంలోనే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య దేవుడిపై భారం వేసి టికెట్‌ కోసం పూజలు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. ఉప్పల్ టిక్కెట్ బి. లక్ష్మారెడ్డికి ఇస్తారు అనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే, మాజీ మేయర్ ఒక్కటయ్యారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ రామ్మోహన్ ఇద్దరూ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఇస్తే ఇద్దరిలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని.. లేకుంటే వేరే వాళ్లకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ కవితను కోరారు. అయితే, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని వారికి కవిత చెప్పినట్లు సమాచారం. ఇలానే మరికొన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సోషల్ మీడియా ప్రచారం బీఆర్ఎస్ జాబితా గులాబీ పార్టీలోని నేతల్లో గుబులు రేపింది. టికెట్ ఉంటుందో.. ఊడుతుందోనంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి అనుచరులకు చెప్పుకుంటున్నట్లు సమాచారం.. అయితే, ఇప్పుడు అసమ్మతి ఎదుర్కొంటున్న నేతల్లో ఎంత మందికి టెకెట్ దక్కుతుందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..