KCR: అన్యాయాన్ని ఊరుకునేది లేదు.. చివరిశ్వాస వరకు పులిలా కొట్లాడతా.. నిప్పులు చెరిగిన కేసీఆర్..
నల్లగొండ వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పదవులు శాశ్వతంకాదు.. తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షానే ఉంటాం.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
నల్లగొండ వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పదవులు శాశ్వతంకాదు.. తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షానే ఉంటాం.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్‌కు వార్నింగ్‌లు ఇచ్చారు గులాబీ బాస్. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని అప్పటిదాకా వెంటపడి కొట్లాడుతామన్నారు. వేటాడుతామన్నారు. రైతు బంధు నుంచి పంట బోనస్‌ల దాకా దేన్నీ వదలబోమన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని.. చివరిశ్వాస వరకు పులిలా కొట్లాడతా అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు పదవులు తప్ప ప్రజల సమస్యలు పట్టవంటూ విమర్శించారు.
రైతులను చెప్పుతో కొడుతావా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనివ్వరా..? ఎన్ని గుండెలు మీకు అంటూ కేసీఆర్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ప్రజలకు తన మీద ఏం కోపం వచ్చిందో తెలియదు కానీ.. పాలిచ్చే ఆవును వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ కామెంట్ చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత విద్యుత్ కోతలు లేకుండా చూశామని కేసీఆర్ అన్నారు. తాము అధికారం నుంచి దిగిపోయిన వెంటనే కరెంట్ కోతలు మొదలయ్యాయని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని గులాబీ బాస్ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. తెలంగాణ హక్కులు శాశ్వతమని అన్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్న వారిని చెప్పుతో కొట్టాలని కేసీఆర్ అన్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేడిగడ్డ దగ్గర ఇప్పటికీ నీళ్లు ఉన్నాయని.. దమ్ముంటే వాటిని రైతులకు అందివ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆటబొమ్మ కాదని అన్నారు. రెండు మూడు పిల్లర్లు కుంగిపోతే వాటిని సరి చేయాలని సూచించారు.
వీడియో చూడండి..
కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేలేవరకు పోరాటం చేయాల్సిందేనని అన్నారు కేసీఆర్. అందుకే నల్లగొండలో సభ పెట్టానని అన్నారు. ఇది రాజకీయ సభ కాదన్నారు. ఒకప్పుడు ఆముదాలు, బత్తాయి తోటలతో బతికిన నల్లగొండ జిల్లాలో లక్షల టన్నుల వడ్లు పండించే స్థితికి తీసుకొచ్చామని అన్నారు కేసీఆర్. ఆ పంటలకు నీళ్లు ఎలా ఇచ్చామో తెలుసుకోవాలని అన్నారు. ప్రజలు ఉద్యమించకపోతే ఎవరూ మనల్ని రక్షించరని అన్నారు కేసీఆర్. ఓట్లు ఉన్నప్పుడే కొందరు వస్తారని.. ఆ తరువాత ఎవరూ పట్టించుకోరని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తమకు ఎవరూ సహకరించకున్నా.. ఈ ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశామని తెలిపారు. నల్లగొండ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఒకప్పుడు ఫ్లోరైడ్‌తో అల్లాడిపోయిన నల్లగొండ జిల్లాను ఎవరూ పట్టించుకోలేదని.. తెలంగాణ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నల్లగొండ జీరో ఫ్లోరైడ్‌గా మారిందని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..