Telangana: తెలంగాణలో రుణమాఫీ మంటలు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్, బీజేపీ ఫైర్..

|

Aug 06, 2024 | 5:44 PM

రుణమాఫీ విషయంలో ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రుణమాఫీ విషయంలో తెలంగాణ సర్కారు రైతులను మోసం చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. దాదాపు 40 లక్షల మంది రైతులు లక్ష రూపాయల వరకు రుణం తీసుకుంటే 17 లక్షల మందికే మాఫీ చేశారన్నారు.

Telangana: తెలంగాణలో రుణమాఫీ మంటలు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్, బీజేపీ ఫైర్..
Crop Loan Waiver Scheme
Follow us on

రుణమాఫీ విషయంలో ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రుణమాఫీ విషయంలో తెలంగాణ సర్కారు రైతులను మోసం చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. దాదాపు 40 లక్షల మంది రైతులు లక్ష రూపాయల వరకు రుణం తీసుకుంటే 17 లక్షల మందికే మాఫీ చేశారన్నారు. రుణం మాఫీ కాని రైతులు వివరాలు పంపించాలన్నారు నిరంజన్ రెడ్డి. ఇందుకోసం తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా ఓ నెంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. రుణమాఫీ అయ్యేవరకు, రైతు హామీలు నెరవేర్చేవరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ నేతలు స్పష్టంచేస్తుననారు. వరంగల్ డిక్లరేషన్‌లో‌ ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 15 వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటోంది ప్రభుత్వం. ప్రతిపక్షాల తీరుపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. రైతాంగం ద్వారా రాజకీయం చేయాలని విపక్షాలు చూస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అభూత కల్పనలతో రైతుల మనోభావాలను దెబ్బతీయవద్దని సూచిస్తున్నారు.

మంత్రి తుమ్మల ఏమన్నారంటే..

ఇప్పటి వరకు 30 వేల రైతుల ఖాతాలకు సంబంధించి సాంకేతికంగా ఇబ్బంది వచ్చిందని అంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. లక్ష లోపు రుణాలకు సంబంధించి 17 వేల ఖాతాల్లో రుణమాఫీ జరగలేదన్నారు. దీనికి సంబంధించి 85 కోట్ల రూపాయలు తిరిగి వచ్చాయని మంత్రి తుమ్మల చెప్పారు. లక్షన్నర రుణమాఫీలో సాంకేతిక సమస్యలకు సంబంధించి ఇంకా డీటేయిల్స్ అందలేదన్నారు.

ఇప్పటికే లక్షన్నరలోపు రుణాలు మాఫీ చేశామని.. త్వరలోనే రూ.2లక్షల వరకు రుణాలన్నీ మాఫీ చేస్తామని తుమ్మల చెప్పారు. ప్రతి రైతుకూ రుణమాఫీ చేసే బాధ్యత తమదని.. సాంకేతిక కారణాలతో ఎవరికైనా మాఫీకాకపోయినా..వాటిని పరిష్కరించి రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.. అప్పుడే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయంటూ విమర్శించారు. తమపై బురదజల్లితే ఆ బురద వాళ్ల మీదే పడుతుందని తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ రచ్చబండ..

ఇదంతా ఇలా ఉంటే రేపటి నుంచి గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది బీజేపీ. రుణమాఫీపై తాము ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు విశేష స్పందన లభిస్తోందని ఆపార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు 27 వేల మంది రైతులు తమ సమస్యను ఫిర్యాదు రూపంలో చెప్పారంటున్నారు. రైతుల నుంచి సేకరించిన ఫిర్యాదులతో గవర్నర్ కలుస్తామంటున్నారు బీజేపీ నేతలు.

నిరంజన్ రెడ్డి ఫైర్..

రుణమాఫీ మాఫీ చేసినట్లు మాట్లాడుతున్నారే తప్ప ఎంత మందికి ఇచ్చారనేది లెక్క ఎందుకు చెప్పడం లేదని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రుణమాఫీ కాని రైతులు వివరాలు తాము చూపించే నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..