Telangana: స్క్రూలు మింగిన ఏడాదిన్నర బాలుడు… వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లిన పేరెంట్స్.. చివరకు

|

Mar 06, 2022 | 1:04 PM

Telangana News: ఇంట్లోని వారంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ఏడాదిన్నర చిన్నారి ఆడుకుంటూ వెళ్లి సైకిల్ స్క్రూలను మింగేశాడు.

Telangana: స్క్రూలు మింగిన ఏడాదిన్నర బాలుడు... వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లిన పేరెంట్స్.. చివరకు
Child Swallow Screws
Follow us on

Warangal: ఇంట్లోని వారంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ఏడాదిన్నర చిన్నారి ఆడుకుంటూ వెళ్లి సైకిల్ స్క్రూలను మింగేశాడు. వరంగల్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వర్ధన్నపేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కుమ్మరిగూడెంకు చెందిన ఉప్పునూతుల రాంమ్మూర్తి, మాధవిల కుమారుడు అయాన్స్ ఈనెల 3న ఇంట్లో ఆడుకుంటూ  సైకిల్ స్క్రూలను మింగేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతని నోట్లో నుంచి రెండు స్క్రూలను వెంటనే బయటకు తీసేశారు. అనుమానంతో ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ తీయించగా కడుపులో మరో స్క్రూ ఉందని డాక్టర్లు తెలిపారు. బాబు పరిస్థితి బాగానే ఉన్నా ఎప్పుడు ఏమవుతుందో అని ఆ చిన్నోడి తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని.. మోషన్ ద్వారా అది వస్తుందని డాక్టర్లు తెలిపారు. అలా జరగకపోతే ఎండోస్కోపి ద్వారా తీయాల్సి ఉంటుందని వెల్లడించారు. చిన్న పిల్లలు ఆడుకుంటున్నప్పుడు తగు జాగ్రత్తలు వహించి.. పిల్లలను సంరక్షించుకోవాలని తల్లిదండ్రులకు డాక్టర్లు సూచిస్తున్నారు.

Also Read: Telangana: ఆదిలాబాద్ జిల్లాలో వింత.. పాలు తాగుతున్న శివాలయంలోని నంది

కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే