అసెంబ్లీ లాబీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పెన్ను.. దీని వెనుక ఇంత కథ ఉందా..?

అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర విషయాలు వింటాం.. రాజకీయ విమర్శలు అఫ్ ది రికార్డ్ ముచ్చట్లు ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాం. ఈ క్రమంలోనే శుక్రవారం ఒక పెన్ను అసెంబ్లీ లాబీల్లో ఆకర్షణగా మారింది. అంతలా అట్రాక్ట్ చేసిన ఆప్షన్ విశేషాలు ఏంటో తెలుసుకోండి.

అసెంబ్లీ లాబీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పెన్ను.. దీని వెనుక ఇంత కథ ఉందా..?
Shabbir Ali Boxer Ali Pen
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Balaraju Goud

Updated on: Aug 02, 2024 | 9:09 PM

అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర విషయాలు వింటాం.. రాజకీయ విమర్శలు అఫ్ ది రికార్డ్ ముచ్చట్లు ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాం. ఈ క్రమంలోనే శుక్రవారం ఒక పెన్ను అసెంబ్లీ లాబీల్లో ఆకర్షణగా మారింది. అంతలా అట్రాక్ట్ చేసిన ఆప్షన్ విశేషాలు ఏంటో తెలుసుకోండి.

ఆయన మాజీ మంత్రి షబ్బీర్ అలీ. అసెంబ్లీ లాబీల్లోకి వచ్చిన ఆయనతో అందరూ పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అంతలోనే ఆయన జేబులో ఉన్న పెన్ను అక్కడ ఉన్న వారికి కంట పడింది. ఇదేంటి.. ఈ పెన్ స్పెషాలిటీ ఏంటి అని అడిగారు. అప్పుడు షబ్బీర్ అని చెప్పిన విశేషాలు అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేశాయి.

అది మౌంట్ బ్లాక్ అనే కంపెనీకి సంబంధించిన పెన్. ఇలాంటి పెన్నులు ప్రపంచంలో 900 మాత్రమే ఉన్నాయి. మౌంట్ బ్లాక్ ఖరీదైన వస్తువుల తయారీలో ప్రఖ్యాతి గాంచిన కంపెనీ. అలాగే పెన్నుల్లో కూడా ఆ కంపెనీకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి నాలుగైదు ఏళ్లకు ఒక స్పెషల్ ఎడిషన్ పెన్నులు రిలీజ్ చేస్తుంది. అవి ఎవరో ఒక అసాధారణ, ప్రసిద్ధిగాంచిన వ్యక్తుల పేరుతో ఉంటాయి. గతంలో గాంధీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గాంధీ ఎడిషన్ మౌంట్ బ్లాక్ పెన్నుని వాడుతూ ఉంటారు.

ఇప్పుడు షబ్బీర్ అలీ జేబులో ఉంది కూడా ప్రముఖ బాక్సర్ అలీ పేరుతో తయారుచేసిన పెన్. దానిపైన అలీ అని గోల్డ్ కలర్ అక్షరాలు చెక్కి.. చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు. కేవలం 900 మాత్రమే బాక్సర్ అలీ పేరుతో తయారుచేసిన పెన్నులు. అయితే షబ్బీర్ అలీ పేరులో కూడా అలీ ఉండడంతో ఒక అభిమాని ఆయనకి దీన్ని గిఫ్టుగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. దీని ఖరీదు లక్షకు పైగానే ఉంటుందని, ఇక గాంధీ పేరుతో ఉన్న లిమిటెడ్ ఎడిషన్ పెనుల ఖరీదైతే ఐదు లక్షలు దాటిందని అన్నారు షబ్బీర్ అలీ. కొద్దిసేపు ఈ పెన్ను అసెంబ్లీ లాబీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అటు నుంచి వచ్చిపోయే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దాన్ని పట్టుకొని చూసి వివరాలకు తెలుసుకొని వెళ్లడం కనిపించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…